ఏసీపీ ఆకస్మిక తనిఖీ
సత్తుపల్లి: సత్తుపల్లి పోలీస్‌స్టేషన్‌ను కల్లూరు ఏసీపీ వసుంధరయాదవ్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, ఆవరణలోని వాహనాలు, పెండింగ్‌లో ఉన్న ఎఫ్‌ఐఆర్‌లను పరిశీలించారు. రౌడీషీటర్లు, హిస్టరీ షీటర్లపై నిఘా ఉంచాలని, కానిస్టేబుళ్లను గ్రామ పోలీస్ అధికారులుగా నియమించాలని ఆదేశించారు. ఆయా గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ సమర్థవంతంగా నిర్వహించేలా సూచనలు చేయాలన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు కోసం కమ్యూనిటీ అవగాహన ప్రారంభించాలని, సీఈఐఆర్ పోర్టల్ ద్వారా చోరీకి గురైన సెల్‌ఫోన్లను త్వరగా చేధించి బాధితులకు అప్పగించాలని ఏసీపీ పేర్కొన్నారు. సీఐ, ఎస్‌హెచ్‌ఓ తుమ్మలపల్లి శ్రీహరి, ఎస్‌ఐలు వీరప్రసాద్, వీరప్రతాప్, ప్రదీప్ ఉన్నారు.


