సత్తుపల్లిటౌన్: ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేలా కృషి చేస్తున్నామని డీఎంహెచ్‌ఓ బి.కళావతిబాయి తెలిపారు. సత్తుపల్లి ఎన్టీఆర్‌నగర్‌లో రూ.1.43 కోట్లతో నిర్మించనున్న అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనులకు శుక్రవారం ఆమె భూమిపూజ చేసి మాట్లాడారు. ఎండ తీవ్రత పెరుగుతున్నందున వడదెబ్బ బారినపడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం డిప్యూటీ డీఎంహెచ్‌ఓ కార్యాలయం, వ్యాక్సిన్ కేంద్రాల ను పరిశీలించారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ టి.సీతారాం, గంగారం పీహెచ్‌సీ వైద్యులు ఆర్. అవినాష్, ఎన్‌హెచ్‌ఎం జిల్లా ప్రాజెక్టు అధికారి మేకల దుర్గ, డీపీఎం సాంబశివరెడ్డి, మున్సిపల్ కమిషనర్ నర్సింహ, మార్కెట్ చైర్మన్ దోమ ఆనంద్‌బాబు, నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, ఎండీ.కమల్‌పాషా, తోట సుజలరాణి, గాదె చెన్నారావు, నారాయణరావు, పింగళి సామేలు, చెన్నారావు పాల్గొన్నారు.
వేసవిలో నాణ్యమైన విద్యుత్ సరఫరా
ముదిగొండ: వేసవిలో డిమాండ్ మేరకు అంతరాయాలు లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేలా ప్రణాళిక రూపొందించామని ఎస్‌ఈ శ్రీనివాసాచారి వెల్లడించారు. ముది గొండ మండలం న్యూలక్ష్మీపురం సబ్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన 5ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. అదనపు భారం పడినా తట్టుకునేలా సబ్‌స్టేషన్లలో పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటుచేస్తున్నామని తెలిపారు. డీఈలు నాగేశ్వరరావు, భద్రు, ఏడీఈ రామదాసు, ఏఈ ఎం.శ్రీని వాస్, ఏఈలు రాజేష్, బోజ్య పాల్గొన్నారు.
నేడు సౌర విద్యుత్‌పై
అవగాహన సమావేశం
ఖమ్మంవ్యవసాయం: బీడు భూముల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్న రైతుల సమావేశాన్ని శనివారం ఏర్పాటుచేసినట్లు ఖమ్మం ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలి పారు. ఖమ్మం ఇల్లెందు క్రాస్‌లోని విద్యుత్ కార్యాలయ గెస్ట్‌హౌస్‌లో ఉదయం 11గంట లకు సమావేశం మొదలవుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యుత్, రెడ్‌కో అధి కారులతో పాటు రుణ సౌకర్యం అందించే బ్యాంకుల అధికారులు పాల్గొని వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తారని తెలిపారు.
చేనేత కళాకారులకు అవార్డులు
ఖమ్మంగాంధీచౌక్: రాష్ట్ర స్థాయిలో కొండా లక్ష్మణ్ బాపూజీ పేరిట ఇవ్వన్ను అవార్డులకు చేనేత కళాకారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు ఎం.విజయలక్ష్మి తెలిపారు. చేనేత కళాకారులు, డిజైనర్లకు వృత్తి నైపుణ్యత, ప్రత్యేకతల ఆధారంగా అవార్డులు ప్రకటించనున్నట్లు వెల్లడించారు. కళాకారులైతే 2024 డిసెంబర్ 31నాటికి 30ఏళ్లు నిండి, చేనేత రంగములో పదేళ్ల అనుభవం కలిగిన వారే కాక చేనేత డిజైనర్లకు 25ఏళ్ల వయస్సు పైబడి, ఐదేళ్ల అనుభవం ఉండాలని తెలిపారు. ఈమేరకు దరఖాస్తులను హనుమకొండలోని చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకుల కార్యాలయంలో ఏప్రిల్ 15వ తేదీలోగా అందజేయాలని సూచించారు.
మైన్స్ సేఫ్టీ ఆఫీసర్ పరిశీలన
సత్తుపల్లిరూరల్: సత్తుపల్లిలోని జేవీఆర్ ఓసీ, సీహెచ్‌సీలను డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ(ఎలక్ట్రికల్) ఆనందవేలు శుక్రవారం పరిశీలించారు. రక్షణ విషయంలో తీసుకుంటున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఓసీ ప్రాజెక్టు ఆఫీసర్ ఎన్‌వీఆర్.ప్రహ్లాద్, ఉద్యోగులు కేఎస్‌ఎన్.రాజు, ఎం. వెంకటేశ్వరరావు, డి.శ్రీనివాసరావు, బి.రాజేశ్వరరావు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వ వైద్యం
ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వ వైద్యం


