పెనుబల్లి: ఓ లారీడ్రైవర్ గుండెపోటుకు గురికాగా సకాలంలో స్పందించిన వీఎం బంజర్ పోలీసులు ఆయనను ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. ఏపీలోని ఏలూరు జిల్లా చింతలపూడి నుండి మొక్కజొన్న లోడ్ హైదరాబాద్ తీసుకెళ్తున్న లారీ డ్రైవర్ మొగుళ్ల కృపారావుకు బుధవారం తెల్లవారుజామున వీఎం బంజర్ సమీపాన ఛాతినొప్పి వచ్చింది. దీంతో రోడ్డు పక్కన వాహనాన్ని ఇపి రామకృష్ణ అనే వ్యక్తికి తన పరిస్థితి చెప్పడంతో ఆయన వీఎం బంజర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈమేరకు హెడ్ కానిస్టేబుల్ పెంటయ్య, కానిస్టేబుల్ వీర రాఘవులు, స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ పుల్లారావు చేరుకుని కృపారావును పోలీసు వాహనంలో పెనుబల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించగా సకాలంలో వైద్యం అందడంతో ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు. దీంతో రామకృష్ణ, పోలీసుసిబ్బందిని స్థానికులు అభినందించారు.