నేలకొండపల్లి: అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగా, కుటుంబీకులు నిద్ర నుంచి మేల్కొని బయటకు వచ్చేలోగా సర్వం అగ్నికి ఆహుతవడంతో కట్టుబట్టలు మాత్రమే మిగిలాయి. మండలంలోని కొత్తకొత్తూరుకు చెందిన కస్తూరి పద్మకు చెందిన ఇంట్లో సోమవారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. నిద్రలో ఉన్న పద్మ, కుటుంబ సభ్యులు మేల్కొని బయటకు పరుగులు తీయగా మంచాలు, బట్టలు, బీరువా, కూలర్ తదితర సామగ్రి కాలి బూడిదయ్యాయి. అగ్నిమాపక శాఖ సిబ్బంది వచ్చేలేగా ఏమీ మిగలకపోగా, ఘటనపై అనుమానం వ్యక్తం చేస్తూ పద్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో ఓ వ్యక్తి తనను చంపుతానని బెదిరించాడని, ఆయనే ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని ఫిర్యాదులో పేర్కొన్నారు.