ఖమ్మం స్పోర్ట్స్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్‌లో జరగనున్న ఖేలో ఇండియా ఉషూ టోర్నీకి తెలంగాణ నుంచి ఖమ్మంకు చెందిన పి.పవిత్రాచారి ఎంపికై ంది. ఇటీవల కర్ణాటక రాష్ట్రం భాగల్‌పూర్‌లో జరిగిన సౌత్ జోన్ పోటీల్లో ప్రతిభ చాటిన ఆమె జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈసందర్భంగా ఆమెను డీవైఎస్‌ఓ టి.సునీల్‌కుమార్‌రెడ్డి, కోచ్ పి.పరిపూర్ణచారి అభినందించారు.
న్యాయవ్యవస్థపై
అవగాహన అవసరం
కొణిజర్ల: బాలికలు న్యాయ వ్యవస్థపై అవగాహన కలిగి ఉండాలని, తద్వారా హక్కుల పరిరక్షణ సాధ్యమవుతుందని జిల్లా న్యాయ సేవాఽధికార సంస్థ కార్యదర్శి కే.వీ.చంద్రశేఖరరావు తెలిపారు. తనికెళ్లలోని తెలంగాణ గురుకుల సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో ఆకాంక్ష ట్రస్టు ఆధ్వర్యాన సోమవారం ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆయన బాలికల సంరక్షణకు ఉన్న చట్టాలు, సెక్షన్లను వివరించారు. ఆయా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, తద్వారా అవసరమైన సమయంలో మేలు జరుగుతుందని తెలిపారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ.రజిత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నేరెళ్ల శ్రీనివాస్, డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు, వైస్ ప్రిన్సిపాల్ ఎం.నవ్య, అధ్యాపకులు కే.పీ.ఐశ్వర్య, కె.రజిని, కె.రజితతో పాటు ఎన్.శ్రీనివాసశర్మ, సీహెచ్.హైమావతి, ప్రతిభారెడ్డి, నాగమణి, లలిత, వంగూరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
విద్యార్థులు ఒత్తిడికి
లోను కావొద్దు
పెనుబల్లి: పదో తరగతి విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా సిద్ధమై వార్షిక పరీక్షలు రాయాలని డీఈఓ సోమశేఖరశర్మ సూచించారు. మండలంలోని వీఎం బంజర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవం, పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం సోమవారం నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించడమే కాక భవిష్యత్ లక్ష్యాలపై దృష్టి సారించాలన్నారు. డైట్ కళాశాల ప్రిన్సిపాల్ సామినేని సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు ప్రశ్నాపత్రాన్ని క్షుణ్ణంగా చదివాక జవాబులు సూటిగా సకాలంలో రాయాలని సూచించారు. వీఎం బంజర్ ఎస్సై కె.వెంకటేష్, పాఠశాల హెచ్‌ఎం ఎస్.సత్యనారాయణ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రూ.45.16 లక్షలకు పాలేరు సంత ఖరారు
కూసుమంచి: మండలంలోని పాలేరులో ప్రతీ శుక్రవారం జరిగే సంత ఏడాది కాలం నిర్వహణ అప్పగించేందుకు సోమవారం వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని కొత్తూరుకు చెందిన బజ్జూరు ఉపేందర్‌రెడ్డి రూ.45.16లక్షలకు దక్కించుకున్నారు. గత ఏడాది రూ.37.60లక్షలు పలకగా, ఈసారి రూ.7.56 లక్షలు అదనంగా ఆదాయం సమకూరింది. వేలంలో మొత్తం 19మంది పాల్గొనగా ప్రభుత్వ మద్దతు ధర రూ.51,29,700గా నిర్ణయించి పాట మొదలుపెట్టడంతో ఉపేందర్‌రెడ్డి అత్యధికంగా పాడారు. ఎంపీఓ రాంచందర్‌రావు, గ్రామ కార్యదర్శి హరీష్ తదితరులు పాల్గొన్నారు.
మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లిన దుండగులు
కల్లూరు/కల్లూరు రూరల్: మండలంలోని కొర్లగూడెంకు చెందిన మహిళ బైరెడ్డి పద్మావతి సోమవారం తన ఇంటి ముందు పని చేసుకుంటుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమె మెడలో నుంచి 25 గ్రాముల బంగారం గొలుసు లాక్కుని పారిపోయారు. కన్నుమూసి తెరిచేలోగా నిందితులు పారిపోయారని బాధితురాలు వాపోయింది. రూ.లక్షకు పైగా విలు వైన గొలుసు చోరీపై ఆమె ఫిర్యాదుతో కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు.
ఖేలో ఇండియా పోటీలకు ఎంపిక
ఖేలో ఇండియా పోటీలకు ఎంపిక