రేపు అవగాహన సదస్సు | - | Sakshi
Sakshi News home page

రేపు అవగాహన సదస్సు

Feb 9 2025 12:24 AM | Updated on Feb 9 2025 12:24 AM

ఖమ్మంసహకారనగర్‌: ఖమ్మంలోని మహిళా ప్రాంగణం, డైట్‌ కళాశాలల్లో ఈ నెల 10న విద్యార్థుల కోసం అవగాహన సదస్సులు, పోస్టర్‌ తయారీ పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఈఓ ఈ.సోమశేఖరశర్మ తెలిపారు. పాఠశాలల నుంచి బయాలజీ ఉపాధ్యాయులు, 8, 9వ తరగతి విద్యార్థులు ఇందులో పాల్గొనాలని సూచించారు. పోస్టర్ల తయారీ పోటీల్లో పాల్గొనేందుకు చార్ట్‌లు, రంగులు ఎవరికి వారే తెచ్చుకోవాలని తెలిపారు.

చోరీ ఘటనలో ఇద్దరి అరెస్ట్‌

కూసుమంచి: గత ఏడాది ఏప్రిల్‌లో కూసుమంచికి చెందిన బిక్కసాని నరేశ్‌ ఇంట్లో చోరీ చేసిన నిందితులను శనివారం అరెస్ట్‌ చేసినట్లు ఎస్‌ఐ నాగరాజు తెలిపారు. బాధితుడి ఫిర్యాదుతో విచారణ చేపట్టగా మండలంలోని సోమ్లాతండాకు చెందిన బానోత్‌ నవీన్‌, భగవత్‌వీడు తండాకు చెందిన భూక్యా సురేశ్‌ చోరీ చేసినట్లు తేలిందని పేర్కొన్నారు. నిందితులను అరెస్ట్‌ చేసి వారి నుంచి నాలుగున్నర తులాల బంగారు గొలుసు, రూ.62 వేల నగదు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ వివరించారు.

ద్విచక్రవాహనం దొంగ అరెస్ట్‌

ఖమ్మంక్రైం: ద్విచక్రవాహనాన్ని చోరీ చేసిన వ్యక్తిని ఖమ్మం వన్‌టౌన్‌ పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. ఖమ్మం రిక్కాబజార్‌ ప్రాంతానికి చెందిన పాలడుగు విజయ్‌ అనుమానాస్పదంగా తిరుగుతుండగా జమ్మిబండ ప్రాంతంలో అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ నేపథ్యాన ఇటీవల బైక్‌ చోరీ చేసినట్లు అంగీకరించడంతో రిమాండ్‌కు తరలించినట్లు సీఐ ఉదయ్‌కుమార్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement