కోడలిపై దాడి ఘటనలో హెడ్‌ కానిస్టేబుల్‌పై కేసు | - | Sakshi
Sakshi News home page

కోడలిపై దాడి ఘటనలో హెడ్‌ కానిస్టేబుల్‌పై కేసు

Jun 19 2024 12:12 AM | Updated on Jun 19 2024 11:00 AM

-

బోనకల్‌: గుండె కుడివైపు ఉందనే కారణంతో మహిళను ఆమె భర్త వేధించగా, ప్రశ్నించినందుకు ఆమైపె దాడి చేసిన మామ, హెడ్‌కానిస్టేబుల్‌ టి.వెంకటేశ్వర్లు, అత్త అన్నపూర్ణపై కేసు నమోదు చేసినట్లు బోనకల్‌ ఎస్‌ఐ మధుబాబు తెలిపారు. బోనకల్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న వెంకటేశ్వర్లు పెద్ద కుమారుడు భాస్కరాచారికి ఖమ్మంకు చెందిన భవానీతో 2018లో వివాహం జరిగింది. 

అయితే, భవానీకి గుండె కుడివైపు ఉందనే కారణంతో భర్త, అత్తామామలు వేధిస్తున్నారు. ఈనేపథ్యాన భవానీ బోనకల్‌లో నివాసముంటున్న వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్లగా ఈనెల 14న వెళ్లగా మాటామాట పెరగడంతో ఆమైపె అత్తామామలు దాడి చేశారు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకటేశ్వర్లు దంపతులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మధుబాబు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement