
ఖమ్మంమయూరిసెంటర్: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ పెరుగుతుండడంతో సంస్థకు అదే స్థాయిలో ఆదాయం సమకూరుతోంది. రద్దీ ఆధారంగా అధికారులు సర్వీసులు నడిపిస్తుండడం కలిసొస్తోంది. ఈనెల 15వ తేదీ సోమవారం ఒకేరోజు ఖమ్మం రీజియన్ నుండి సంస్థకు రూ.1,50,94,737 ఆదాయం సమకూరింది. ఎండల తీవ్రత అధికంగా ఉన్నా శుభకార్యాలు, ఇతర పనుల కోసం ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుండడం ఆదాయం పెరగడానికి కారణంగా చెబుతున్నారు. ఈనెల 4వ తేదీన ఖమ్మం రీజియన్ నుండి సంస్థకు రూ.1.35 కోట్లు ఆదాయం రాగా, సోమవారం అంతకుమించి రూ.1.50 కోట్లకు పైగా రావడం విశేషం.
ఈనెల 15వ తేదీన రూ.1.50 కోట్ల రాబడి
డిపోల వారీగా ఈనెల 15న నమోదైన ఆదాయం (రూ.ల్లో)
డిపో ఆదాయం
ఖమ్మం 40,07,094
భద్రాచలం 29,04,350
సత్తుపల్లి 26,60,958
మణుగూరు 19,68,628
కొత్తగూడెం 15,98,245
మధిర 15,73,989
ఇల్లెందు 3,81,473
