హై షుగర్‌తో అవస్థ | Sakshi
Sakshi News home page

హై షుగర్‌తో అవస్థ

Published Thu, Nov 16 2023 12:34 AM

తల్లిదండ్రులతో కుమార్తె నదియా - Sakshi

బాలిక ఆరోగ్యంపై తల్లిదండ్రుల ఆందోళన

దాతల చేయూత కోసం ఎదురుచూపులు

కల్లూరు: కల్లూరు మండలం ఎర్రబోయినపల్లి గ్రామానికి చెందిన నల్లగట్ల ప్రభాకర్‌ – రమ్య కుమార్తె ఆరేళ్ల బాలిక నదియా కొద్దినెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. హైదారాబాద్‌లో కూలి పనులు చేస్తూజీవనం సాగిస్తున్న తల్లిదండ్రులు పాపను ఆస్పత్రికి తీసుకెళ్లగా 600 ఎంజీ హై షుగర్‌తో బాధపడుతోందని వైద్యులు నిర్ధారించారు. ఇప్పటివరకు తమ వద్ద డబ్బుతో పాటు తెలిసిన వారి వద్ద చేసిన అప్పులతో చికిత్స చేయించారు. అయినా పరిస్థితి మెరుగుపడకపోవడంతో పని వదిలేసి స్వగ్రామమైన ఎర్రబోయినపల్లి వచ్చారు. పక్కనే ఉన్న తిరువూరులో నదియాకు వైద్యం చేయిస్తున్నారు. కానీ ఆస్పత్రి ఖర్చులు, మందులకు సరిపడా డబ్బు లేక దాతల కోసం ఎదురు చూస్తున్నారు. దాతలు స్పందించి 79975 65311(ఫోన్‌ పే) నంబర్‌ ద్వారా సంప్రదించాలని వారు కోరుతున్నారు.

బైక్‌ చోరీల నిందితుడు అరెస్ట్‌

గతంలో ఆయనపై 22 కేసులు

కొత్తగూడెంఅర్బన్‌: కొత్తగూడెం త్రీటౌన్‌ పోలీసులు బుధవారం ద్విచక్రవాహనాల చోరీల నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసుల వివరాలిలా ఉన్నాయి.. కొత్తగూడెం పాత బస్‌డిపో వద్ద ఎస్‌ఐ డి.విజయకుమారి సిబ్బందితో వాహనాల తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. తాను నడుపుతున్న బైక్‌ను అపహరించి తీసుకొస్తున్నట్లు అంగీకరించాడు. గార్ల – బయ్యారానికి చెందిన కృష్ణపై పలు పోలీస్‌స్టేషన్లలో 22 కేసులు నమోదై ఉన్నాయని, అతడి వద్ద ఉన్న ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకుని, నిందితుడిని రిమాండ్‌కు తరలించామని పోలీసులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement