ఖమ్మం డిపోలో పరిశీలిస్తున్న ఈడీ వినోద్‌కుమార్
కరీంనగర్ జోన్ ఈడీ వినోద్‌కుమార్
ఖమ్మం మామిళ్లగూడెం: ఖమ్మం డిపో సహా రీజియన్‌లోని అన్ని డిపోలు లాభాల బాట పట్టేలా ఉద్యోగులు కృషి చేయాలని ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ వినోద్‌కుమార్ సూచించారు. ఖమ్మం డిపోలోని వివిధ విభాగాల్లో బుధవారం తనిఖీ చేసిన ఆయన ఉద్యోగులతో సమావేశమయ్యారు. ప్రయాణికులతో మర్యాదగా వ్యవహరించడం ద్వారా ఓఆర్ పెంచా లని తెలిపారు. ఏయే రూట్లలో నష్టాలు వస్తున్నాయో గుర్తించడమే కాక అందుకు కారణాలను అన్వేషించి ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని సూచించారు. అనంతరం ఈడీ డిపోలో మొక్క నాటారు. ఈకార్యక్రమంలో ఆర్‌ఎం సీహెచ్.వెంకన్న, డిప్యూటీ ఆర్‌ఎంలు పవిత్ర, బి.ప్రసాద్, ఖమ్మం డిపో మేనేజర్ శ్రీనివాస్‌తో పాటు రామయ్య, ప్రసాద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
వైరాలో ఈవీఎం
డిస్ట్రిబ్యూషన్ సెంటర్
వైరా: రానున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వైరాలోని వ్యవసాయ మార్కెట్ గోదాంలో ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటుచేయనున్నారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ సత్యప్రసాద్ బుధవారం గోదాంలో పరిశీలించారు. నియోజకవర్గంలో పోలింగ్‌స్టేషన్లు, అవసరమయ్యే ఈవీఎంలపై ఆరా తీసిన ఆయన భద్రతపై అధికారులకు సూచనలు చేశారు. ఆతర్వాత తహసీల్దార్ కార్యాలయంలో వివిధ పార్టీల నాయకులతో సమావేశమై ఓటరు జాబితా తయారీ, మార్పులు, చేర్పులకు వచ్చిన దరఖాస్తుల పరిశీలనపై చర్చించారు. వైరా ఏసీపీ రెహమాన్, తహసీల్దార్ కే.వీ.శ్రీనివాస్, డీటీ రామారావు తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో సమృద్ధిగా
ఎరువుల నిల్వలు
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో సమృద్ధిగా ఎరువుల నిల్వలు ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బి.సరిత వెల్లడించా రు. జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్, కాల్వొడ్డు, పొట్టి శ్రీరాములు రోడ్లలో ఎరువుల దుకాణాల్లో అధికారులతో కలిసి బుధవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎరువుల ని ల్వలు, ఈ–పాస్ అమలు, రికార్డులను పరిశీలించి కొనుగోలుకు వచ్చిన రైతులతో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. అనంతరం డీఏఓ సరిత మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఎక్కడా ఎరువుల కొరత లేదని, ఈ విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని రైతులు నమ్మొద్దని సూచించారు. వ్యాపారులు ఎవరైనా యూరియా కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీల్లో ఖమ్మం అర్బన్ ఏఓ కిషోర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
టీకాలతోనే చిన్నారులకు ఆరోగ్యరక్ష
కొణిజర్ల: చిన్నారులకు నిర్ణీత వ్యవధిలో టీకాలు వేయించడం ద్వారా వారి ఆరోగ్యానికి భద్రత లభిస్తుందని జిల్లా వ్యాక్సినేషన్ మేనేజర్ సీ.హెచ్.రమణ తెలిపారు. కొణిజర్ల, తీగలబంజర, గుబ్బగుర్తి గ్రామాల్లో కొణిజర్ల వైద్యాధికారి సురేష్ ఆధ్వర్యాన బుధవారం చేపట్టిన వ్యాక్సినేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చిన్నారులతో పాటు గర్భిణులకు వ్యాక్సిన్ల ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. పల్లె దవాఖానా వైద్యులు శ్రీలేఖ, తులసి, ఉద్యోగులు రమణ, వరమ్మ, ముంతాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఎరువుల దుకాణంలో రికార్డులు తనిఖీ చేస్తున్న డీఏఓ సరిత
గోదాంలో పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్ సత్యప్రసాద్


