ఫిర్యాదులు పెండింగ్‌లో ఉండొద్దు
గ్రీవెన్స్ డేలో ప్రజలు ఇచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ గౌతమ్ ఆదేశించారు.
మంగళవారం శ్రీ 21 శ్రీ మార్చి శ్రీ 2023
8లో
బకాయిల షాక్!
సారక్షితినిధి, ఖమ్మం: జిల్లాలో ఏళ్లుగా పేరుకుపోయిన బకాయిలు వసూలు చేసేందుకు విద్యుత్ శాఖ కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్ శాఖకు గుదిబండలా మారింది. రూ.కోట్లలో పేరుకుపోయిన బకాయిల వసూళ్లకు ఎన్ని యత్నాలు చేసినా ఫలితం రావడం లేదు. ఏళ్ల తరబడి బిల్లులు వసూలు కాకపోవడంతో విద్యుత్ శాఖాధికారులపై ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి వస్తుండగా.. ఎక్కువ బిల్లు ఉన్న కార్యాలయాలకు వెళ్లి త్వరగా చెల్లించాలని కోరుతున్నారు.
గ్రామపంచాయతీల్లోనే..
విద్యుత్ బిల్లుల బకాయిలు ఎక్కువగా గ్రామపంచాయతీల్లోనే ఉన్నాయి. జీపీల్లో వీధి దీపాలు, తాగునీటి సరఫరాకు విద్యుత్ అవసరం ఉండగా.. 5,692 కనెక్షన్లపై రూ.13,62,18,000 వసూలు కావాల్సి ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావా ల్సిన నిధులు సక్రమంగా విడుదల కాకపోవడంతో విద్యుత్ బిల్లులు చెల్లించలేకపోతున్నామని గ్రామపంచాయతీల బాధ్యులు చెబుతున్నారు. కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి ఉండడంతో బకాయిలు రూ.కోట్లకు చేరాయి. మొత్తం బకాయిల్లో గ్రామపంచాయతీల్లోనే సింహభాగం ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.
వసూలు యత్నాలు ఫలించేనా..
విద్యుత్ బకాయిలు వసూలు చేసేందుకు ఆ శాఖ అధికారులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. గతంలోనే పలుమార్లు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి సమాచారం ఇచ్చారు. తాజాగా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో మరోమారు బకాయి ఉన్న ప్రభుత్వ శాఖల అధికారులను సంప్రదిస్తున్నారు. అయితే ఆయా కార్యాలయాలకు ప్రభుత్వం నుంచి బిల్లులు రావాల్సి ఉండడంతోనే చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని సమాచారం.
న్యూస్‌రీల్
విద్యుత్ బిల్లులు చెల్లించని ప్రభుత్వ శాఖలు
ఏటేటా పేరుకుపోతున్న వైనం
గ్రామపంచాయతీల్లోనూ రూ.కోట్ల బిల్లులు పెండింగ్
జిల్లావ్యాప్తంగా బకాయి రూ.31.55 కోట్లు
అత్యధిక విద్యుత్ బకాయిలు ఉన్న ప్రభుత్వశాఖలు
శాఖ బకాయి
గ్రామపంచాయతీలు
(వాటర్ వర్క్స్, వీధిదీపాలు) రూ.13,62,18,000
ఖమ్మం కార్పొరేషన్ రూ.3,52,38,000
ఇతర శాఖలు రూ.3,27,32,000
జలవనరుల శాఖ రూ.2,75,26,000
విద్యాశాఖ రూ.1,75,01,000
రెవెన్యూ రూ.1,53,50,000
మెడికల్ రూ.1,37,41,000
పంచాయతీ రాజ్ రూ.86,17,000
పోలీస్ రూ.72,54,000
మున్సిపాలిటీలు
(వాటర్ వర్క్స్, వీధిదీపాలు) రూ.55,40,000
పీడబ్ల్యూడీ అండ్ ఆర్‌అండ్‌బీ రూ.34,31,000
ఆర్‌డబ్ల్యూఎస్ రూ.32,48,000
పేరుకుపోతూ పెండింగ్‌లో
జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల నుంచి రావాల్సిన బకాయిలు ఏటేటా పెరుగుతూనే ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా మొత్తం 11,420 కనెక్షన్లకు సంబంధించి రూ.31,55,08,000 పెండింగ్‌లో ఉన్నాయి. బిల్లులు చెల్లించాల్సిన ప్రభుత్వ కార్యాలయాల అధికారులు కూడా స్పందించకపోవడంతో ఫలితం ఉండడం లేదని విద్యుత్ శాఖ ఉద్యోగులు వాపోతున్నారు. గతంలో గ్రామపంచాయతీల బిల్లులు వసూలు కాక వీధి దీపాలు, కార్యాలయాల కనెక్షన్లు తొలగించిన సందర్భాలు ఉన్నాయి. ఇక జిల్లాలోని సత్తుపల్లి, మధిర, వైరా మున్సిపాలిటీలతోపాటు ఖమ్మం కార్పొరేషన్‌కు సంబంధించి బకాయి రూ.4 కోట్లకు పైగానే ఉంది. ఇలా అనేక ప్రభుత్వ శాఖల్లో రూ.వేల నుంచి రూ.కోట్ల వరకు బకాయిలు ఉండడం గమనార్హం.
గ్రీవెన్స్‌లో బాధితుల ఫిర్యాదులు వింటున్న సీపీ


