స్మార్ట్‌ఫోన్‌ ఆర్డర్‌ చేస్తే.. సోన్‌పాపిడి డబ్బా.. 

Online Fraudsters Cheating People In Karnataka - Sakshi

గ్రామీణుడికి సైబర్‌ వంచకుని టోపీ  

సాక్షి, బెంగళూరు‌: ఆన్‌లైన్‌ వంచకులు తీయని మాటలతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. కారుచవగ్గా ఖరీదైన వస్తువులు మీవేనంటూ వచ్చే ఫోన్లకు జనం నిజమేనని నమ్మడం మోసగాళ్లకు కలిసొస్తోంది. చిత్రదుర్గం జిల్లా చెళ్లకెరె తాలూకాలోని గోపనహళ్లి గ్రామానికి చెందిన నరసింహమూర్తి ఇదేమాదిరి నష్టపోయాడు. దీపావళి పండుగ సందర్భంగా శాంసంగ్‌ గెలాక్సీ మొబైల్‌ఫోన్‌ను రూ. 1,700 కే అందిస్తున్నామని ఒక వ్యక్తి ఫోన్‌ చేశాడు. పోస్టల్‌ శాఖ నుంచి పార్శిల్‌ వస్తుందని, డబ్బు చెల్లించి తీసుకోవాలని సూచించగా నరసింహమూర్తి తక్కువధరకే స్మార్ట్‌ఫోన్‌ వస్తోందని మురిసిపోయాడు.   (చదివింది ఏడు.. రూ. 20 కోట్లకు కుచ్చుటోపి)

మిఠాయిపెట్టె, గిల్టు చైన్‌  
బుక్‌ చేయగా గురువారం బెంగుళూరు హెబ్బాళ నుంచి గోపనహళ్లి తపాలా కార్యాలయానికి నరసింహమూర్తి పేరుమీద ఓ పార్శిల్‌ వచ్చింది. ఆయన రూ.1700 ఇచ్చి పార్సల్‌ తీసుకుని చూడగా, ఫోన్‌కు బదులు 50 రూపాయల సోన్‌ పాపిడి మిఠాయి పెట్టె, ఓ రోల్డ్‌ గోల్డ్‌ చైన్‌ కనిపించింది. దీంతో నరసింహమూర్తి నిర్ఘాంతపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపాడు. 

Read latest Karnataka News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top