హొసపేటె: నగరంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఆధ్వర్యంలో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. హొసపేటెలోని పీవీఎస్బీసీ పాఠశాల ప్రాంగణం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ.. హంపీ రోడ్, మూరంగడి సర్కిల్, డాక్టర్ పునీత్ రాజ్‌కుమార్ సర్కిల్, మెయిన్ మసీదు ప్రాంతం, కౌల్పేట్తో పాటు నగరంలోని వివిధ ప్రధాన ప్రాంతాల గుండా కొనసాగింది. ఊరేగింపులో పెద్ద సంఖ్యలో స్వయం సేవకులు పాల్గొనడంతో నగరంలోని ప్రధాన రహదారుల్లో సందడి నెలకొంది. ఊరేగింపు సాగిన మార్గాల్లో పలువురు స్వయం సేవకులపై పూలు చల్లుతూ అభిమానం చాటుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డీవైఎస్పీ మురళీధర్, మల్లేష్ దొడ్డమణి నేతృత్వంలో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు చేపట్టారు.


