రాయచూరు రూరల్: నగరంలోని లాల్ బహద్దూర్ శాస్త్రి కాలనీలో నిత్యావసర వస్తువులను అప్పుగా ఇవ్వడానికి నిరాకరించిన నరసింహులు అనే వ్యాపారి శనివారం హత్యకు గురైన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనకు కారకుడైన తిలక్ సింగ్ను అరె్స్ట్ చేసినట్లు ఎస్పీ అరుణాంగ్శు గిరి తెలిపారు.
కుటుంబాన్ని ఆదుకోండి
హత్యకు గురైన నరసింహులు కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని ఆర్యవైశ్య సంఘం డిమాండ్ చేసింది. ఆదివారం ఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. సంఘం అధ్యక్షుడు పురుషోత్తం మాట్లాడుతూ.. నరసింహులు నిర్వహిస్తున్న దుకాణంలో గుట్కా, సిగరెట్లు, పాన్ మసాలా విక్రయించే విషయంలో దుకాణ యజమానితో కొందరు యువకులు గొడవపడి నరసింహులును హత్య చేసినట్లు ఆరోపించారు. అనంతరం ఎస్పీ అరుణాంగ్శు గిరికి వినతిపత్రం అందజేశారు.


