● మరో విషాద ఘటనలో రెండు కుటుంబాలక తీరని శోకం కలిగింది. ఇంట్లో టీ చేయడానికి పాలు కావాలంటే, తీసుకొస్తామని ఓ బాలుడు, మరో చిన్నారిని తీసుకుని స్కూటర్‌లో బయల్దేరాడు. కానీ లారీ రివర్స్‌లో వచ్చి వారి ఉసురు తీసింది.
● విధి ఎంత విచిత్రమైనదో ఈ ప్రమాదాలు చాటుతున్నాయి. ప్రమాదంలో గాయపడి కోలుకున్న వ్యక్తి డిశ్చార్జి అయ్యాడు. హమ్మయ్య అనుకుంటూ భార్య బంధువులతో కలిసి కారులో సొంతూరికి వెళ్తుండగా మళ్లీ విధి చిన్నచూపు చూసింది. గూడ్స్ లారీ ఢీకొనడంతో అతనితో పాటు భార్య, మరో ఇద్దరు ప్రాణాలు విడిచారు.
శివమొగ్గ: రాష్ట్రంలో 2 వేర్వేరు ప్రమాదాల్లో ఆరుమంది మరణించారు. శుక్రవారం సాయంత్రం శివమొగ్గ జిల్లాలోని శికారిపుర తాలూకా, తరలఘట్ట క్యాంప్ వద్ద రాష్ట్ర రహదారిపై కారు, లారీని ఢీకొనగా, కారులో ఉన్న నలుగురు దుర్మరణం చెందారు. శికారిపుర తాలూకాలోని ముట్టిగ గ్రామానికి చెందిన ఉజ్జప్ప (65), అతని భార్య లలితమ్మ (60), బంధువు జయమ్మ (58), హావేరివాసి కారు డ్రైవర్ గురుబసప్ప (35) మృతులు. హనుమంతప్ప (65) అనే మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు.
ఎలా జరిగింది..?
గత నెలలో జరిగిన ఒక ప్రమాదంలో ఉజ్జప్ప గాయపడ్డాడు. శివమొగ్గలోని ఒక ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. కోలుకుని డిశ్చార్జ్ చేయడంతో బాడుగ కారు తీసుకుని కుటుంబీకులతో కలిసి ముట్టిగ గ్రామంలోని ఇంటికి బయల్దేరారు. ఈ సమయంలో శికారిపుర నుంచి ఎదురుగా వస్తున్న సరుకు రవాణా లారీ ఈ కారును ఢీకొట్టడంతో కారు నుజ్జు నుజ్జయింది. తీవ్ర గాయాలతో నలుగురు అక్కడే మృత్యువాత పడ్డారు. జిల్లా ఎస్పీ బి.నిఖిల్, డీఎస్పీ కేశవ్, ఎస్‌ఐ ఆర్.ఆర్.పాటిల్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, శికారిపుర రూరల్ ఠాణాలో కేసు నమోదు చేశారు.
ప్రమాదానికి కారణమైన గూడ్స్ లారీ
నుజ్జయిన కారు
కారును లారీ ఢీ, దంపతులు సహా
నలుగురు మృతి
శివమొగ్గ జిల్లాలో ఘోర ప్రమాదం
ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి
వెళ్తుండగా చావు వికటాట్టహాసం


