హుబ్లీ: పాత హుబ్లీ ఆనంద నగర మరియమ్మ ఆలయం దగ్గర తలుపులు వేసిన ఇంటి తాళం పగలగొట్టి చోరీ చేసిన ఘటనలో పాత హుబ్లీ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి రూ.3.45 లక్షల విలువ చేసే ఆభరణాలు, వెండి, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో న్యూ ఆనంద్‌నగర్ శ్రీకాంత్ (36) ప్రవీణ్(36)లను అరెస్ట్ చేశారు. పాత హుబ్లీ పోలీస్ స్టేషన్ సీఐ సింధూరక్ నేతృత్వంలో ఎస్‌ఐలు విశ్వనాథ, మంజునాథ ఇతర సిబ్బంది ఈ కేసు మిస్టరీని ఛేదించారు. పోలీస్ సిబ్బంది కార్యాచరణను కమిషనర్ అభినందించారు.
పరిషత్ ఎన్నికల్లో
71 శాతం పోలింగ్
హుబ్లీ: ధార్వాడ జిల్లాలో శుక్రవారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతం వివరాలను సంబంధిత అధికారులు ప్రకటించారు. మొత్తం జిల్లాలో ఓటర్లు 35,119 మంది ఉండగా 25,214 మంది ఓటు వేశారు. అంటే 71.08 శాతం పోలింగ్ శాతం నమోదైంది. 20,014 మంది పురుషులకు గాను 14,982 మంది ఓటు వేయగా 74.86 శాతం పోలింగ్ నమోదైంది. అలాగే 15,105 మంది మహిళా ఓటర్లకు గాను 10,232 మంది ఓటు వేశారు. అంటే 67.74 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు.
స్టింగ్ ఆపరేషన్ దురదృష్టకరం
హుబ్లీ: రాజకీయాల్లో స్టింగ్ ఆపరేషన్ దురదృష్టకరమని, ఈ విషయంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని రాజ్యసభ సభ్యుడు నాగరాజ్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం డీకే.శివకుమార్ తననే స్టింగ్ ఆపరేషన్ చేసే ప్రయత్నాలు జరిగాయనడం కంచే చేను మేసిన చందంగా ఉందన్నారు. స్టింగ్ ఆపరేషన్‌కు కారకులు ఎవరో తేల్చి శిక్షించాలన్నారు. ప్రియాంక్ ఖర్గే హోం మంత్రి అయిన తర్వాత ఆర్‌ఎస్‌ఎస్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నా వాటిని విడిచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఖర్గే ఇలా చేస్తున్నారన్నారు. ప్రచారయావతో ప్రజల మనసును చెడగొడుతున్నారని విమర్శించారు. విధాన పరిషత్ ఎన్నికల్లో ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేశారని, బీజేపీ తప్పకుండా గెలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
బాలల సంరక్షణ చట్టాలు అవసరం
రాయచూరు రూరల్: బాలలపై లైంగిక దౌర్జన్యాల నివారణ, పిల్లల హక్కుల సంరక్షణకు పోక్సో చట్టాలపై విద్యార్థులు అవగాహన కల్గించాల్సిన ఆవశ్యకత ఉందని జిల్లా విద్యా శాఖాధికారి మల్లికార్జున పేర్కొన్నారు. శనివారం డీడీపీఐ కార్యాలయంలో క్రైసంస్థ టింగ్ టాంగ్ సురక్షత వాల్ పోస్టర్లను విడుదల చేసి మాట్లాడారు. 18 ఏళ్ల కన్నా తక్కువ వయస్సున్న పిల్లలకు లైంగిక నివారణ చట్టం ద్వారా రక్షణ కల్పించడానికి 1930 ద్వారా అవకాశం ఉందన్నారు. పిల్లలు ఆన్‌లైన్‌లో లింక్‌లపై బటన్లు ఒత్తకుండా సైబర్ నేరాలకు పాల్పడరాదన్నారు. కార్యక్రమంలో కేపీ.అనిల్ కుమార్, తాయప్ప తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం
రాయచూరు రూరల్ : నగరంలో 80 అడుగుల రోడ్డు విస్తరణకు త్వరలో శ్రీకారం చుడుతున్నట్లు నగరసభ కమిషనర్ జుబిన్ మహాపాత్రో పేర్కొన్నారు. శనివారం నగరంలోని చంద్రమౌళేశ్వర సర్కిల్ నుంచి గంజ్ రోడ్డు వరకు 80 అడుగుల రోడ్డును నిర్మిస్తారన్నారు. చంద్రమౌళేశ్వర సర్కిల్ నుంచి గంజ్ రహదారిలో కుడి, ఎడమ వైపు ఆక్రమించిన దుకాణాలు, హోటళ్లు ఇతర నివాసులతో చర్చించి రహదారి విస్తరణకు సహకరించాలని కోరారు. రిమ్స్, ఒపెక్ ఆస్పత్రికి, హైదరాబాద్, గద్వాలకు వెళ్లే ప్రధాన రహ దారి కావడంతో రూ.25 కోట్లతో 80 అడుగుల వెడల్పుతో రహదారి నిర్మాణం చేపడతామన్నారు. రహదారి విస్తరణకు ప్రజలు, వ్యాపారస్థులు సమ్మతించారన్నారు.
ఘనంగా చిక్కోడి ఎంపీ
నిశ్చితార్థం
●రాయచూరు కోడలు కానున్న ప్రియాంక
రాయచూరు రూరల్: చిక్కోడి లోక్‌సభ సభ్యురాలు, ప్రజా పనుల శాఖ మంత్రి సతీష్ జార్కిహోళి ముద్దుల తనయ ప్రియాంక జార్కిహోళికి పెళ్లి కుదిరింది. శుక్రవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో చార్టెర్డ్ అకౌంటెంట్‌గా పని చేస్తున్న రాయచూరు జిల్లా దేవదుర్గకు చెందిన గౌతమ్‌ను ఆమె వరించింది. గౌతమ్ తండ్రి ప్రాంతీయ రవాణా అధికారి(ఆర్‌టీఓ)గా విధులు నిర్వహించి పదవీ విరమణ చేశారు. కాగా జార్కిహోళి కుటుంబాల సభ్యులు ఏకమై ఎంపీ నిశ్చితార్థాన్ని ఘనంగా నిర్వహించారు.


