హంపీపై యునెస్కో ప్రత్యేక నిఘా | - | Sakshi
Sakshi News home page

హంపీపై యునెస్కో ప్రత్యేక నిఘా

Oct 25 2026 1:41 AM | Updated on Oct 25 2026 1:41 AM

సాక్షి,బళ్లారి: ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న హంపీలో విజయనగర సామ్రాజ్య వైభవానికి ప్రతీక అయిన హంపీలోని మరోసారి అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లో నిలుస్తోంది. యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తింపు పొందిన హంపీలోని చారిత్రాత్మక కట్టడాల పరిరక్షణ, నిర్వహణ, అభివృద్ధి పనులు పరిశీలించేందుకు అంతర్జాతీయ వారసత్వ నిపుణుల బృందం (యునెస్కో) రంగంలోకి దిగింది. శనివారం నుంచి వారం రోజుల పాటు యునెస్కో తవ్వకాలు చేపట్టే ప్రక్రియ ప్రారంభించింది. విజయనగర జిల్లా యంత్రాంగం, యునెస్కో బృందం సంయుక్తంగా తవ్వకాలు చేపడుతోంది. పురాతన ఆలయాలు, శిల్పాలు, రాజ ప్రసాదాల అవశేషాలు తదితర చారిత్రాత్మక నిర్మాణాల ప్రస్తుత పరిస్థితిని అధ్యయనం చేస్తోంది. యునెస్కో బృందంలోని పలువురు అధికారులు, ఉన్నతాధికారులు భాగస్వాములయ్యారు.

చారిత్రక సాక్ష్యాలకు హాని లేకుండా తవ్వకాలు

హంపీ మాస్టర్‌ ప్లాన్‌ అమలు, వారసత్వ ప్రాంతం నిర్వహణ, ఆక్రమణల నియంత్రణ, చారిత్రక సాక్ష్యాలు దెబ్బ తినకుండా తవ్వకాలు చేపడుతుంది. హంపీలో భారతీయ పురావస్తు సర్వేక్షణ శాఖ (ఏఎస్‌ఐ) చేపడుతున్న శాసీ్త్రయ తవ్వకాల్లో చరిత్రకు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హజారరామాలయం సమీపంలో చేపడుతున్న తవ్వకాల్లో పురాతన రాతి కాలువ వ్యవస్థ బయటపడుతున్నాయి. విజయనగర సామ్రాజ్య కాలంలో నీటి నిర్వహణ, ఆలయ నిర్మాణ నైపుణ్యం తదితరాలు వెలుగు చూస్తున్నాయి. 14వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు విజయనగర సామ్రాజ్య రాజధానిగా విరాజిల్లిన హంపీకి 1986లో యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే. నిపుణుల బృందం పర్యటనలో భాగంగా హంపీలోని విరుపాక్ష ఆలయం, విజయ విఠల ఆలయం, లోటస్‌ మహల్‌ తదితర చారిత్రక కట్టడాలను పరిశీలించింది.

అధికారుల నుంచి వివరాల సేకరణ

కెన్యాకు చెందిన జార్జ్‌ అబుంగ్‌, జపాన్‌కు చెందిన ఇచిడిషిమోడా నేతృత్వంలోని యునెస్కో బృందం విజయనగర, కొప్పళ జిల్లాల ఉన్నతాధికారులతో పాటు భారతీయ పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) హంపీ ప్రపంచ వారసత్వ ప్రదేశ నిర్వహణ ప్రాధికార సంస్థ, పర్యాటక శాఖ, రాష్ట్ర పురావస్తు శాఖ తదితర విభాగాల అధికారుల నుంచి వివరాలు సేకరించింది. హంపీలోని చారిత్రక స్మారక కట్టడాల సంరక్షణ కోసం ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమాచారం తెలుసుకుంది. వివిధ శాఖల నుంచి సమగ్ర వివరాలు సేకరించిన యునెస్కో బృందం సభ్యులు, హంపీ ప్రపంచ వారసత్వ ప్రదేశ నిర్వహణ ప్రాధికార సంస్థ(హవామ) ఏర్పాటు చేసిన విధానాన్ని ప్రశంసించినట్లు సమావేశంలో పాల్గొన్న ఓ అధికారి తెలిపారు. ఇలాంటి ప్రత్యేక ప్రాధికార సంస్థలను ఇతర ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేసి, చారిత్రక స్మారక కట్టడాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని బృందం అభిప్రాయపడినట్లు వెల్లడించారు.

వారసత్వ కట్టడాల పరిశీలన

అధికారుల బృందాల తవ్వకాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement