● త్వరలో లీటరుపై రూ.4– 5 బాదుడు
శివాజీనగర: అనేక రకాల వస్తు సేవల ధరల పెంపుతో అసంతృప్తిగా ఉన్న ప్రజలకు ప్రభుత్వం మరో వడ్డన ఇవ్వబోతోంది. పాల ధరను పెంచాలన్న పాడిరైతుల సంఘాల ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకరించింది. 16 జిల్లాల పాల సంఘాల ప్రతినిధి బృందం సీఎం డీకే శివకుమార్‌ను కలసి, ప్రభుత్వ నందిని పాల కొనుగోలు, విక్రయ ధరను లీటరుకు రూ.8 నుంచి 10 వరకు పెంచాలని అభ్యర్థించింది. కరువు వల్ల ఆవులు, గేదెలకు గడ్డి దొరకడం లేదని, దాణా ధరలు బాగా పెరిగాయని తెలిపారు. నిర్వహణ ఖర్చులు కూడా ఎక్కువ కావడంతో పాల సేకరణ ధరలు పెంచాల్సిందేనని డిమాండ్ చేయగా సీఎం ఒప్పుకున్నట్లు తెలిసింది. దీని ఫలితంగా త్వరలోనే పాల ధర లీటరుకు రూ.4–5 వరకు పెరిగే అవకాశముంది. త్వరలో ఉత్తర్వులు వెలువడవచ్చు.
బడిలోనే గుండెపోటుతో...
హుబ్లీ: ధార్వాడ జిల్లాలోని నవలగుందలో జగద్గురు అజాత నాగలింగస్వామి విద్యాపీఠం పాఠశాలలో 8వ తరగతి విద్యార్థిని వైష్ణవి (14) గుండెపోటుతో కన్నుమూసింది. పాఠశాలలో పరీక్షలు పూర్తి అయ్యాక మధ్యాహ్నం భోజనం చేసిన ఆమె చేతులు కడుక్కుంటుండగా ఉండగా ఎదలో నొప్పిగా ఉందంటూ ఆమె ఉపాధ్యాయులకు తెలియజేసింది. వెంటనే బాలికను స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స అందిస్తుండగా బాలిక ఊపిరి వదిలింది. వైష్ణవికి ముందు నుంచి గుండె జబ్బు ఉండేది. ఆమె చికిత్స పొందుతోంది. అంతలోనే చనిపోయిందని తండ్రి బసవరాజ్ రోదించారు.


