● ప్రభుత్వ నిర్ణయం చారిత్రాత్మకం
● నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి
సాక్షి,బళ్లారి: నగరంలోని ప్రధాన కూడలి ఎస్పీ సర్కిల్‌కు మహర్షి వాల్మీకి సర్కిల్‌గా ప్రభుత్వం నామకరణం చేసిందని నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన ఈ మేరకు గురువారం ప్రభుత్వం వెలువరించిన అంశాన్ని ఓ ప్రకటనలో వివరించారు. ఆదికవి, రామాయణం రాసిన మహానుభావుడు మహర్షి వాల్మీకి పేరును ఎస్పీ సర్కిల్‌కు నామకరణం చేయడం ఎంతో సంతోషంగా ఉందని, ఇది చారిత్రాత్మక నిర్ణయం అని గుర్తు చేశారు. నగరంలో నిత్యం పెద్ద సంఖ్యలో జనం తిరగాడే రద్దీ ప్రాంతానికి మహర్షి వాల్మీకి పేరును పెట్టడంతో ఆ సమాజంతో పాటు అన్ని వర్గాల ప్రజలు హర్షిస్తున్నారన్నారు. మహర్షి వాల్మీకిని అన్ని కులాల వారు ఆరాధిస్తారని, అలాంటి మహానుభావుడి పేరును ఎస్పీ సర్కిల్‌కు పెట్టడం గర్వకారణంగా ఉందన్నారు. మహర్షి వాల్మీకి విగ్రహ ప్రతిష్టాపన కూడా త్వరలో ఘనంగా నిర్వహిస్తామన్నారు.


