దళితులపై దౌర్జన్యాలు అరికట్టండి | - | Sakshi
Sakshi News home page

దళితులపై దౌర్జన్యాలు అరికట్టండి

Sep 25 2026 2:23 AM | Updated on Sep 25 2026 2:23 AM

బళ్లారి అర్బన్‌: రాష్ట్రంలో మాదిగలతో పాటు దళితులపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, కుల దూషణల ఘటనలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సఫాయి కర్మచారి అభివృద్ధి సంస్థ మాజీ అధ్యక్షుడు హెచ్‌.హనుమంతప్ప డిమాండ్‌ చేశారు. నగరంలోని పత్రికా భవన్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2023 నుంచి 2026 వరకు రాష్ట్రంలో నమోదైన ఎస్సీ, ఎస్టీ అఘాయిత్యాలపై జిల్లాల వారీగా శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. దళితులపై అఘాయిత్యాల కేసుల్లో వేగవంతమైన దర్యాప్తు కోసం రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని, బాధిత కుటుంబాలకు తక్షణ పరిహారం, పునరావాసం కల్పించాలని కోరారు. సాక్షులకు పోలీసు రక్షణ కల్పించి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్లను నిర్ణీత గడువులోగా ప్రభుత్వం నెరవేర్చకపోతే హోం మంత్రి నివాసాన్ని ముట్టడించడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నిరసనలు చేపడతామని హెచ్చరించారు. సుంకన్న, అరుణాచలం, ప్రసాద్‌, నరసప్ప, రాజేష్‌, మారన్న, శివశంకర్‌, హులియప్ప తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement