సర్‌లో ముగ్గురు ఎన్నికల కమిషనర్లు | - | Sakshi
Sakshi News home page

సర్‌లో ముగ్గురు ఎన్నికల కమిషనర్లు

Sep 24 2026 2:06 AM | Updated on Sep 24 2026 2:06 AM

● దేశాన్ని దారి తప్పిస్తున్న ఓటర్ల నమోదు

● బహుభాషా నటుడు ప్రకాష్‌రాజ్‌ ఆరోపణ

రాయచూరు రూరల్‌: దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఓటరు నమోదు ప్రక్రియలు దారి తప్పిస్తున్నాయని, సర్‌లో ముగ్గురు ఎన్నికల కమిషనర్లు ఉన్నారని బహుభాషా నటుడు ప్రకాష్‌రాజ్‌ ఆరోపించారు. బుధవారం రాయచూరు, కలబుర్గిలలో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. భారత ఎన్నికల కమిషనర్‌ కార్యాలయంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌ కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్‌షా కలిసి సర్‌ను ఎలా చేయాలనే అంశాలపై చర్చించి ఓటర్లను దారి తప్పించే ప్రయత్నంలో ఉన్నారన్నారు. దేశంలో ఐదు కోట్ల మంది పేర్లు తొలగి పోవడంతో కోర్టు మెట్లెక్కారన్నారు. రాష్ట్రంలో ఎన్నికల అధికారి అన్బుకుమార్‌ పేర్లలో అక్షర దోషాలుంటే సరి చేసుకోవాలని కోరడం అసభ్యంగా ఉందన్నారు. పశ్చిమ బెంగాల్‌ మాదిరిగా కర్ణాటకను చేయడానికి అవకాశం కల్పించడం తగదన్నారు. ఈనెలాఖరులోగా గల్లంతైన వారి జాబితాను సేకరిస్తున్నట్లు వివరించారు. అధికారులు పేదల ఇళ్లకు వెళ్లకుండా శ్రీమంతుల ఇళ్లకు వెళ్లి సమీక్ష చేయడాన్ని తప్పు బట్టారు. అక్టోబర్‌ 15న ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళన చేపడతామన్నారు.

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. ఒకరు మృతి

● పలువురికి గాయాలు

సాక్షి,బళ్లారి: కేఎస్‌ఆర్టీసీ బస్సు, లారీ ముఖాముఖిగా ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, 6 మందికి గాయాలయ్యాయి. బుధవారం హావేరి జిల్లా హళెరథి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చెన్నూరు గ్రామానికి చెందిన ఎస్‌ఎస్‌ మఠ్‌్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. 30 మందికి పైగా బస్సులో ప్రయాణిస్తుండగా ఎదురుగా లారీ రావడంతో ఢీకొన్న నేపథ్యంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను హావేరి జిల్లా ఆస్పత్రికి తరలించారు.

అక్టోబర్‌ 23న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు

రాయచూరు రూరల్‌: ఈశాన్య ఉపాధ్యాయ విధాన పరిషత్‌ స్థానానికి అక్టోబర్‌ 23న ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు కలబుర్గి ప్రాంతీయ కమిషనర్‌ జహీరా నసీమ్‌ పేర్కొన్నారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈశాన్య ఉపాధ్యాయ క్షేత్రం పరిధిలోని రాయచూరు, బీదర్‌, బళ్లారి, కలబుర్గి, యాదగిరి, కొప్పళ, విజయ నగర జిల్లాల్లో ఎన్నికల నియమావళి ప్రకారం ఈనెల 29న నోటిఫికేషన్‌ వెలువడుతుందన్నారు. అక్టోబర్‌ 6 వరకు నామినేషన్ల సమర్పణకు గడువు, 7న పరిశీలన, 9వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరు తేదీ అన్నారు. అవసరమైతే 23వ తేదీన ఎన్నికలు జరుగుతాయని, 27వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారన్నారు.

ఐసీసీ సమావేశం నిర్వహించండి

బళ్లారి అర్బన్‌: తుంగభద్ర జలాశయంలో నీటిని పొదుపు చేసేందుకు రైతుల పంటలకు సకాలంలో నీరు అందించేలా తక్షణమే నీటిపారుదల సలహా సమితి(ఐసీసీ) సమావేశం నిర్వహించాలని తుంగభద్ర రైతు సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ పురుషోత్తం గౌడ డిమాండ్‌ చేశారు. బుధవారం రైతుల సమక్షంలో జిల్లాధికారి కే.నాగేంద్ర ప్రసాద్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ప్రతి రోజు బోర్డు నిర్ణయించిన 9,500 క్యూసెక్కులకు బదులుగా 12 వేల క్యూసెక్కులకు పైగా నీటిని వినియోగిస్తున్నారన్నారు. రైతుల పంటలకు నవంబర్‌ 30 వరకు, మిరప పంటకు డిసెంబర్‌ 30 వరకు నీరు అవసరమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement