రాయచూరు రూరల్: జిల్లాలో తుంగభద్ర ఎడమ కాలువ నుంచి ఆయకట్టు చివరి భూములకు నీరు వదలాలని డిమాండ్ చేస్తూ కాలువలపై రైతులు, నేతలు ఆందోళన చేపట్టారు. కాలువలకు వార బందీ పద్ధతి ప్రకారం నీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రికి విధాన పరిషత్ సభ్యుడు బసన గౌడ బాదర్లి విన్నవించారు. మంగళవారం బెంగళూరులో సీఎం డీ.కే.శివ కుమార్‌తో చర్చించి సింధనూరు తాలూకా గాంధీనగర్ 36వ కాలువ వద్ద ఆందోళన చేపట్టిన విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
కాలువకు నీరు విడుదల చేయాలి
కళ్యాణ కర్ణాటక జిల్లాల్లోని రాయచూరు, లింగసూగూరు, దేవదుర్గ, యాదగిరి జిల్లాలోని శహాపుర, భీమరాయనగుడి, సురపుర తాలూకాల్లో నారాయణపుర కుడి కాలువకు నిరంతరం నీటిని విడుదల చేయాలని రైతు సంఘం అధ్యక్షుడు మస్తాన్ నాయక్ పేర్కొన్నారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేఽశంలో మాట్లాడారు. ఎన్‌ఆర్‌బీసీ కాలువలకు వార బందీ పద్ధతిని స్వస్తి పలికి నిరంతరం నీటిని విడుదల చేయాలన్నారు. సంగమేష్ శివన గౌడ, వీరేష్, నాగప్ప, భీమన్నలున్నారు.


