కరువుతో 82 శాతం పంటనష్టం | - | Sakshi
Sakshi News home page

కరువుతో 82 శాతం పంటనష్టం

Sep 23 2026 1:31 AM | Updated on Sep 23 2026 1:31 AM

శివాజీనగర: రాష్ట్రంలో సగటున 852 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 642 మి.మీ. వర్షమే కురిసింది. జూన్‌ నుంచి రాష్ట్రంలో సగటున మైనస్‌ 36 శాతం వర్షపాతం లోటు నెలకొంది. వానల్లేక 82 శాతం పంట నష్టమైంది అని డిప్యూటీ సీఎం జీ.పరమేశ్వర్‌ చెప్పారు. మంగళవారం విధాన పరిషత్‌లో ఆయన మాట్లాడారు. త్వరలో మరిన్ని కరువు తాలూకాలను ప్రకటిస్తామని, దీంతో మొత్తం సంఖ్య 210కి పెరుగుతుందన్నారు. కేంద్రం నిర్దేశించిన కరువు ప్రమాణాల ప్రకారం రాష్ట్రాన్ని కరువు పీడిత ప్రాంతంగా ప్రకటించాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ సీ.టీ.రవి మాట్లాడుతూ కొందరు నేతల బెదిరింపులకు తలొగ్గి కరువు తాలూకాలను చేరుస్తున్నారని దుయ్యబట్టారు. పరమేశ్వర్‌ మాట్లాడుతూ, గతంలో కరువు తాండవించి రాష్ట్రానికి రూ.39 వేల కోట్ల నష్టం జరిగింది, మేము కేంద్రాన్ని రూ.18 వేల కోట్ల సహాయం కోరామని తెలిపారు. చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే కేంద్రం రూ.3,400 కోట్లు ఇచ్చిందని చెప్పారు. ఇప్పుడు 101 తాలూకాలలో రూ.18 వేల కోట్ల నష్టం జరిగింది, రూ.3,500 కోట్ల నిధులు కోరామని తెలిపారు.

101 తాలూకాలలో

రూ.18 వేల కోట్ల నష్టం

డిప్యూటీ సీఎం పరమేశ్వర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement