హొసపేటె: వర్షాకాలంలో కూడా మండే ఎండలు ఏర్పడంతో చాలా రోజులుగా వర్షాలు లేకపోవడంతో చేతికి వచ్చిన పంటలు ఎండిపోతున్న సమయంలో సోమవారం రాత్రి విజయనగర జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో పంటలకు ఎంతో మేలు జరిగింది. నిరాశలో కూరుకు పోయిన రైతుల కళ్లల్లో రాత్రి కురిసిన భారీ వర్షం ఆనందం కలిగించింది. జిల్లాలోని కూడ్లిగి శివారులో రాత్రి 8 గంటలకు అకస్మాత్తుగా కుండపోత వర్షం మొదలై గంటకు పైగా కురిసింది. ఫలితంగా కూడ్లిగి పట్టణానికి వెలుపల జాతీయ రహదారి–50పై నీరు ఏరులా పారి మోకాలి లోతు వరకు చేరి వాహన రాకపోకలకు అంతరాయం కలిగించింది. భారీ వర్షం హోరుకు వాహనదారులు ఎటు వెళ్లలేక తమ వాహనాలను రోడ్డు పక్కన నిలిపివేశారు. ఆ తర్వాత వర్షపు నీరు తగ్గుముఖం పట్టింది.
కూడ్లిగి వద్ద హైవేపై మోకాలి లోతున నీరు
ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోయి
బారులు తీరిన వాహనాలు


