మట్టి గణనాథులతో పర్యావరణానికి మేలు | - | Sakshi
Sakshi News home page

మట్టి గణనాథులతో పర్యావరణానికి మేలు

Sep 13 2026 7:46 AM | Updated on Sep 13 2026 7:46 AM

రాయచూరు రూరల్‌: నేటి విద్యార్థులు మట్టి గణనాథులపై ప్రచారం చేపట్టి పరిసరాల సంరక్షణకు కృషి చేయాలని హెచ్‌కేఈ సంస్థ కళాశాల ప్రిన్సిపాల్‌ రాజేంద్ర కొండా పేర్కొన్నారు. శనివారం వీరమ్మ గంగమ్మ సిరి కళాశాలలో మట్టితో విగ్రహాల తయారీకి శ్రీకారం చుట్టి విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు పోటీకి తగ్గట్లు మనస్సు పెట్టి విద్య నభ్యసించే విధంగా వారికి విద్యా బోధన చేయాలన్నారు. పాఠాలకు తోడు పాఠ్యేతర అంశాలపై విద్యార్థులు శ్రద్ధ కనబరిచి తమ జ్ఞాపకాలను నెమరు వేసుకోవాలన్నారు. సమావేశంలో ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారి డాక్టర్‌ మహేష్‌, అనిల్‌ కుమార్‌, బసమ్మ, సుష్మాలున్నారు.

బీజేపీకి రాజీనామా

శివాజీనగర: రాజాజీనగర, మహాలక్ష్మినగర బీజేపీ మాజీ ఎమ్మెల్యే, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఎన్‌.ఎల్‌. నరేంద్రబాబు శనివారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీకి విశ్వాసంగా పనిచేసే తన సేవలను గుర్తించలేదని వాపోయారు. కాగా ఈనెల 13వ తేదీన సీఎం డీ.కే.శివకుమార్‌ సమక్షంలో తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement