రాయచూరు రూరల్ : సమాజం అభివృద్ధిలో విద్యార్థుల పాత్ర అమోఘమని గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్ అభిప్రాయ పడ్డారు. శనివారం రాయచూరు తాలూకా యరమరస్ క్యాంప్‌లో తాలూకా స్థాయి ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని, బాల్య వివాహాల నియంత్రణకు సహకరించాలన్నారు. ఆరోగ్యం, పరిసరాల శుభ్రత, సంరక్షణ అంశాలపై దృష్టి సారించాలన్నారు. సమావేశంలో జంగ్లప్ప, బసవరాజ్, సంగమేష్, మంజు పాల్గొన్నారు.
జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక
రాయచూరు రూరల్: నగరంలోని మహాత్మాగాంధీ క్రీడా మైదానంలో శుక్రవారం జరిగిన తాలూకా స్థాయి అథ్లెటిక్ పోటీల్లో లాంగ్ జంప్ పోటీల్లో ప్రతీక్షా మేటి అనే విద్యార్థిని రాణించి జిల్లాస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈసందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు హనుమేష్, వీణ, విశ్వనాథ్, రాధిక విద్యార్థినిని అభినందించి సత్కరించారు.


