రాయచూరు రూరల్: నేటి పోటీతత్వ యుగంలో విద్యార్థులకు జెన్‌జీ, సోషల్ మీడియాపై అవగాహన అవసరమని రాయచూరు రిపోర్టర్స్ గిల్డ్ అధ్యక్షుడు విజయ్ జాగటకల్ పేర్కొన్నారు. శనివారం రాయచూరు రిపోర్టర్స్ గిల్డ్ 25 వసంతాలు పూర్తి చేస్తున్న సమయంలో విద్యార్థులకు ఏర్పాటు చేసిన జెన్‌జీ, సోషల్ మీడియాపై పోటీలను ప్రారంభించి మాట్లాడారు. పోటీల్లో ప్రథమ స్థానం పొందడం ప్రధానం కాదని, పోటీలతో జెన్‌జీ, సోషల్ మీడియాలపై పట్టు సాధించడానికి వీలు కల్పించినట్లు అవుతుందన్నారు. కార్యక్రమంలో వెంకటేష్, రాజ్ గురు, బోయర్, శివమూర్తి, సిద్దయ్య స్వామి, రఘనాథ్, ఖాన్‌సాబ్, వీరనగౌడ, సురేష్, మల్లనగౌడ, బసవరాజ్‌లున్నారు.


