రైతుల అభివృద్ధే డీసీసీ బ్యాంక్‌ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

రైతుల అభివృద్ధే డీసీసీ బ్యాంక్‌ లక్ష్యం

Sep 11 2026 10:51 AM | Updated on Sep 11 2026 10:51 AM

కోలారు: అవిభజిత కోలారు జిల్లాలో డీసీసీ బ్యాంక్‌ నూతన అధ్యక్షుడిగా ఎన్నికై న ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్‌ను గురువారం తాలూకాలోని అరహళ్లి ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతుల అభివృద్ధే డీసీసీ బ్యాంక్‌ లక్ష్యం అని తెలిపారు. అరహళ్లి సొసైటీ అధ్యక్షుడు మంజునాథ్‌ రెడ్డి, పదాధికారులు పాల్గొన్నారు.

నియామకం

కోలారు: కాంగ్రెస్‌ పార్టీ కోలారు జిల్లా నూతన అధ్యక్షుడిగా మేకల నారాయణస్వామిని నియమిస్తూ పార్టీ హైకమాండ్‌ ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీనివాసపురం తాలూకాకు చెందిన మేకల నారాయణ స్వామి ఇంతవరకు కాంగ్రెస్‌ జిల్లా కార్యాధ్యక్షుడిగా పని చేశారు. విధానసభ మాజీ సభాపతి కె.ఆర్‌.రమేష్‌ కుమార్‌కు అత్యంత ఆప్తుడు. మూడు సంవత్సరాలుగా మాలూరు తాలూకాకు చెందిన లక్ష్మీనారాయణ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈయన స్థానంలో కాంగ్రెస్‌ హై కమాండ్‌ మేకల నారాయణస్వామిని జిల్లా అధ్యక్షుడిగా నియమించింది. నూతన అధ్యక్షుడికి పలువురు కాంగ్రెస్‌ నాయకులు అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement