విద్యతోనే ప్రభుత్వ పథకాల లబ్ధి | - | Sakshi
Sakshi News home page

విద్యతోనే ప్రభుత్వ పథకాల లబ్ధి

Sep 11 2026 10:51 AM | Updated on Sep 11 2026 10:51 AM

హొసపేటె: న్యాయ పరిజ్ఞానాన్ని పొందడానికి, ప్రభుత్వ పథకాల లబ్ధికి ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలని న్యాయవాది శ్వేతాంబరి అన్నారు. జేపీ భవన్‌లో మురికివాడల ప్రజల కోసం న్యాయ అవగాహన, ప్రభుత్వ పథకాలపై ఏర్పాటు చేసిన సమాచార శిబిరాన్ని ప్రారంభించి ఆమె మాట్లాడారు. నేటి రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు మురికివాడల ప్రజల సమస్యలను తీర్చడానికి ముందుకు రావడం లేదని ఆరోపించారు. మహిళలు, పిల్లల కోసం ఉన్న ప్రత్యేక చట్టాలను వినియోగించుకోవడంలో మురికివాడల ప్రజలు విఫలమవుతున్నారన్నారు. సమానత్వ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర, మున్సిపల్‌ కార్యాలయ మేనేజర్‌ కృష్ణమూర్తి, స్లం జనాందోళన కర్ణాటక ఆర్గనైజింగ్‌ కో–ఆర్డినేటర్‌ జనార్ధన్‌, సాంఘిక సంక్షేమ శాఖ కొట్రేష్‌, స్లం బోర్డు ఏఈఈ తిమ్మన్న, మహిళా, శిశు సంక్షేమ శాఖ విద్య, పొగాకు నియంత్రణ సెల్‌ బోజరాజు, షెడ్యూల్డ్‌ కులాల శాఖ రామన్న, మైనార్టీ శాఖ మల్లికార్జున, కార్మిక శాఖ రవి, హెచ్‌.వీరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement