హొసపేటె: బళ్లారి రూరల్ ఎమ్మెల్యే బి.నాగేంద్ర రాజీనామా నేపథ్యంలో ఉమ్మడి బళ్లారి జిల్లాలో మంత్రి పదవిని ఎవరికి ఇస్తారనే వార్తలపై స్పందిస్తూ తాను మంత్రి పదవిని ఆశించడం లేదు, తన నియోజకవర్గ అభివృద్ధే తన కల అని విజయనగర జిల్లా కూడ్లిగి ఎమ్మెల్యే డాక్టర్ ఎన్‌టీ శ్రీనివాస్ అన్నారు. తాలూకాలోని అమలాపుర గ్రామంలో శ్రీశరణ బసవేశ్వర కమ్యూనిటీ హాల్‌లో శ్రీక్షేత్ర ధర్మస్థల గ్రామీణాభివృద్ధి ప్రాజెక్ట్ ట్రస్ట్ నిర్వహించిన సామూహిక శ్రీవర మహాలక్ష్మి పూజ, ఒడి నింపే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అదృష్టం కొద్దీ ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీకు సేవ చేసే అవకాశం లభించిందన్నారు. రాజకీయాలు చేయడం మనం అనుకున్నంత సులభం కాదని ఆయన అన్నారు. నియోజకవర్గానికి రూ.వందలాది కోట్లను తేవడం ద్వారా అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నానన్నారు. శ్రీయోగి రాజేంద్ర శివాచార్య మహాస్వామి, శ్రీభుజంగమఠం మహాస్వామి, జీపీ మాజీ అధ్యక్షుడు నవీన్ ఎన్‌టీ, జెడ్పీ మాజీ సభ్యుడు ఎం.శివన్న, సతీష్ శెట్టి, ఏ.చెన్నబసప్ప తదితరులు పాల్గొన్నారు.
నియోజకవర్గ అభివృద్ధే నా కల
ఎమ్మెల్యే డాక్టర్ ఎన్‌టీ శ్రీనివాస్


