బళ్లారి రూరల్ : కర్ణాటక భోవి(వడ్డెర) సంఘం, జిల్లా భోవి వడ్డెర సంఘం సంయుక్త ఆధ్వర్యంలో అక్టోబరు 11న జోళదరాశి దొడ్డనగౌడ రంగమందిరంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు పురస్కారాల ప్రదానోత్సవం జరుగనున్నట్లు కర్ణాటక భోవి వడ్డెర సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ చౌడయ్య తెలిపారు. బుధవారం పత్రికా భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్‌ఎస్‌ఎల్‌్‌సీ, పీయూసీలో 85 శాతం కంటే అధికంగా మార్కులు సాధించిన భోవి వడ్డెర విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి శివరాజ్ తంగడిగి హాజరు కానున్నారు. సాహితీవేత్త డాక్టర్ చౌడయ్య రచించిన శ్రీసిద్దరామేశ్వర మహాత్మె, విద్యార్థుల చేతి పుస్తకాలను భోవి వడ్డెర సంఘం రాష్ట్రాధ్యక్షుడు ఎం.రామప్ప ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. భోవి వడ్డెర సమాజ ఎమ్మెల్యేలు, ప్రముఖులు హాజరు రావాలని కోరారు. ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎం.టీ.మల్లేశ్, జిల్లాధ్యక్షుడు వీ.రామాంజినేయులు, ప్రముఖులు మహేశ్ తదితరులు పాల్గొన్నారు.


