బనశంకరి: సీఎం డీకే శివకుమార్ ప్రభుత్వం గురువారం విధానసౌధలో తమ ప్రభుత్వ శతదినోత్సవ వేడుకలు జరుపుకోవాలని ఉత్సాహంతో ఉండగా ఈడీ తలదూర్చింది. సీనియర్ నేత, ప్రజాపనులశాఖమంత్రి సతీశ్ జార్కిహొళిపై బుధవారం తెల్లవారుజాము నుంచి మెరుపు దాడులకు నాంది పలికింది. మంత్రి, బంధువులు, సన్నిహితులు ఇలా.. 18 స్థలాల్లో సోదాలు ప్రారంభించింది. మంత్రిపై ఫెమా, మనీ లాండరింగ్ చట్టాల కింద కేసులు నమోదు చేసి సోదాలకు దిగారు.
కుమార్తె, ఎంపీ ప్రియాంక నివాసంలో..
● బెంగళూరు నగరంలోని డాలర్స్‌కాలనీలోని మంత్రి ఇల్లు, ప్రభుత్వ బంగ్లాలో..
● బెళగావిలోని నివాసాల్లో సోదాలు జరిపి కంప్యూటర్లు, ఫైళ్లు, రికార్డుల తనిఖీలు చేపట్టారు. దాడి సమయంలో మంత్రి ప్రభుత్వ నివాసంలో ఉన్నారు.
● జార్కిహొళి కుమార్తె, బెళగావి జిల్లా చిక్కోడి ఎంపీ ఎంపీ ప్రియాంక జార్కిహొళి ఇంట్లో కూడా తనిఖీలు జరిగాయి.
● ఈ సందర్భంగా భారీసంఖ్యలో పోలీసులు, కేంద్ర బలగాలు మోహరించాయి.
● మంత్రి బావమరిది మంజునాథ్‌కు చెందిన గోవాలో ఆస్తులలోనూ తనిఖీలు జరిగాయి.
● ఈ పరిణామాలతో మంత్రుల్లో అలజడి నెలకొంది. గురువారం కూడా సోదాలు కొనసాగే అవకాశముంది.
ఈడీ దాడులను ఖండిస్తూ మైసూరులో పార్టీ కార్యకర్తల ధర్నా
బెంగళూరులో మంత్రి జార్కిహొళి ప్రభుత్వ నివాసం
మంత్రి, కుమార్తె, బావమరిది,
ఆప్తుల ఇళ్లలో ముమ్మర సోదాలు
ఫెమా, మనీ లాండరింగ్ కింద కేసులు!
కాంగ్రెస్ సర్కారులో కలవరం


