కావేరి జలాలపై నేడు సుప్రీంలో పిటిషన్‌ | - | Sakshi
Sakshi News home page

కావేరి జలాలపై నేడు సుప్రీంలో పిటిషన్‌

Sep 10 2026 12:03 AM | Updated on Sep 10 2026 12:03 AM

దొడ్డబళ్లాపురం: తమిళనాడుకు మూడోసారి కావేరి జలాల విడుదలకు సీడబ్ల్యూఆర్‌సీ, సీడబ్ల్యూఎంఏ ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేస్తుందని జలవనరుల శాఖ మంత్రి చెలువరాయస్వామి తెలిపారు. బుధవారంనాడు విధానసౌధలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం డీకే శివకుమార్‌తో, న్యాయ నిపుణులతో చర్చించామన్నారు. గురువారంనాడు సుప్రీంలో అప్పీలు దాఖలు చేస్తామన్నారు. సీడబ్ల్యూఆర్‌సీ, సీడబ్ల్యూఎంఏకి కూడా రివ్యూ పిటిషన్‌ ఇచ్చామన్నారు. కావేరి జలాల విడుదలకు మన వద్ద నీటి నిల్వ కావాల్సినంత మేరకు లేదన్నారు. వినాయకనచవితి లోపు వర్షాలు కురిస్తేకానీ నీటి సమస్య తీరదన్నారు. జలాల కోసం తమిళనాడు ప్రభుత్వం నిరంతరం ఒత్తిడి తెస్తోందన్నారు. మంత్రి సతీష్‌ జార్కిహొళి, బంధువుల ఇళ్లపై ఈడీ దాడులు రాజకీయ ప్రేరితమని, బీజేపీ కుట్ర అని ఆరోపించారు.

వారికి నీళ్లు, మాకు విషమివ్వండి

సర్కారుపై రైతు సంఘాల ధ్వజం

మండ్య: తమిళనాడుకు కావేరి నీటి విడుదలను వెంటనే ఆపాలి, సీడబ్ల్యూఆర్‌సీ, సీబ్ల్యూఎంఏ ఆదేశాలను పాటించరాదని జిల్లా రైతు హితరక్షణా సమితి, జైకర్ణాటక సంఘంతో పాటు వివిధ సంఘాల కార్యకర్తలు తలపై రాళ్లను మోసుకుని ధర్నా చేశారు. నగరంలోని జేసీ సర్కిల్‌లో బెంగళూరు–మైసూరు రహదారిలో నిరసనకు దిగారు. కావేరి ప్రాధికార, రాష్ట్ర ప్రభుత్వంపై ఆక్రోశం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, జల వనరుల శాఖ మంత్రి తమిళనాడుకు నీరు వదిలే బదులు రాష్ట్ర రైతులకు ఇంత విషమివ్వాలని దుయ్యబట్టారు. ఆందోళనలో రైతు సంఘాల నాయకులు శివకుమార్‌, బోరయ్య, సునంద జయరాం, బోరలింగేగౌడ, చంద్రశేఖర్‌ శివళ్లి, చంద్రశేఖర్‌, అంబుజమ్మ తదితరులు పాల్గొన్నారు.

మనది ప్రేక్షక పాత్రేనా?

సర్కారుపై బొమ్మై మండిపాటు

శివాజీనగర: కావేరీ జలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషిస్తోందని ప్రజలు భావిస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ ఎంపీ బసవరాజ్‌ బొమ్మై ఆరోపించారు. కావేరీ జలాలను విడుదల చేయాలన్న ఉత్తర్వులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయాలని కోరారు. తాజాగా 7.5 టీఎంసీల నీరు వెళ్లిపోతుందని, వాస్తవ పరిస్థితిని కావేరీ జల అథారిటీల ముందు సమర్థంగా వినిపించలేదన్నారు. కబిని డ్యాంలో సగం నీరు తగ్గిపోయింది, కేఆర్‌ఎస్‌ నుంచి కూడా రోజూ ఐదారు వేల క్యూసెక్‌ల నీటిని విడుదల చేస్తున్నందున, ప్రతిరోజూ దాదాపు అర టీఎంసీ నీరు తగ్గిపోతోంది, రాబోయే రోజుల్లో వర్షం పడే సూచనలు లేవు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం కావేరీ సమస్యను తీవ్రంగా పరిగణించాలని బొమ్మై డిమాండ్‌ చేశారు. తమిళనాడుకు సమాధానం చెప్పే బదులు, కర్ణాటకే పిటిషనర్‌గా మారాలని సూచించారు. ముఖ్యమంత్రి తక్షణమే కావేరీ సమస్యపై దృష్టి సారించాలన్నారు. న్యాయ, సాంకేతిక నిపుణులతో ఢిల్లీకి వెళ్లి చర్చించాలన్నారు.

విడుదల చేయడానికి నీళ్లు లేవు

జలవనరుల మంత్రి చెలువరాయ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement