అనుమాన పిశాచికి బలి | - | Sakshi
Sakshi News home page

అనుమాన పిశాచికి బలి

Sep 10 2026 12:03 AM | Updated on Sep 10 2026 12:03 AM

కృష్ణరాజపురం: సోషల్‌ మీడియా భూతం భార్యభర్తల అంతు చూసింది. బెంగళూరులోని మహాదేవుపుర పరిధిలోని హెచ్‌ఏఎల్‌ విభూతిపురంలో భర్త భార్యను హత్య చేసి ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. ఆటోడ్రైవర్‌ రాఘవేంద్ర (39), భార్య శృతి (31), వీరు 15 ఏళ్ల కిందట ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. శృతి ఇళ్లలో పనులు చేసేది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలను దావణగెరెలోని వారి అమ్మమ్మ ఇంట్లో ఉంచారు. భార్య సోషల్‌ మీడియాలో రీల్స్‌ చేసేది. ఆమెకు అనైతిక సంబంధముందని భర్త అనుమానించి గొడవ పడేవాడు. మంగళవారం రాత్రి కూడా ఇద్దరూ పోట్లాట పడ్డారు. మద్యం మత్తులో ఉన్న రాఘవేంద్ర బీర్‌ బాటిల్‌తో భార్య తలపై కొట్టి ఆమెను చంపేశాడు. ఆ తర్వాత అతను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం ఇంట్లో అలికిడి లేకపోవడంతో ఇరుగుపొరుగు చూడగా ఘోరం బయటపడింది. పోలీసులు విచారణ చేపట్టారు.

భార్యను చంపి, భర్త ఆత్మహత్య

బెంగళూరులో విషాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement