వరుణదేవుని కోసం పెళ్లితంతు | - | Sakshi
Sakshi News home page

వరుణదేవుని కోసం పెళ్లితంతు

Sep 8 2026 12:11 AM | Updated on Sep 8 2026 12:11 AM

మండ్య: ఆకాశంలో మేఘాలు కనిపిస్తున్నా వానలు రావడం లేదు. నదులు, చెరువుల్లో నీటి ప్రవాహం కరువై దుర్భిక్షం తాండవిస్తోంది. పొలాలు, పశుపక్ష్యాదులు వర్షం కోసం పరితపిస్తున్నాయి. ఇప్పటికై నా వరుణదేవుడు కరుణించాలని ప్రజలు పలు రకాలుగా పూజలు చేస్తున్నారు. మండ్య జిల్లాలోని నాగమంగళ తాలూకాలోని దేవలాపురంలో వర్ష దేవున్ని ప్రసన్నం చేసుకోవడానికి గ్రామస్తులు బాలునికి, బాలికకు వివాహ మహోత్సవ తంతు నిర్వహించారు. ఈ జంటను చూసైనా దేవుని మనసు కరిగి మంచి వర్షాలు కురవాలని ప్రార్థించారు. ఈ వేడుకకు చుట్టుపక్కల పల్లెల నుంచి జనం తరలివచ్చారు. వృద్ధ మహిళలు వర్షం కోసం జానపద గీతాలు ఆలపించారు. ప్రసాదం ఆరగించి వధూవరులు, అతిథులు ఎవరికి ఇళ్లకు వారు వెళ్లిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement