హొసపేటె: హంపీ కన్నడ విశ్వవిద్యాలయంలో కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు, అతిథి ఉపన్యాసకులకు గత 15 నెలలుగా వేతనాలు అందక పోవడంతో కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే వేతన బకాయిలు అందజేయాలని కోరుతూ గురువారం ఎమ్మెల్యే గవియప్పకు వినతిపత్రాన్ని సమర్పించారు. కాంట్రాక్టు, అతిథి ఉద్యోగులు నాగవేణి, శ్రీనివాస్ కలాల్, బసవరాజ్ తదితరులు మాట్లాడుతూ కన్నడిగులకు గర్వకారణమైన, కన్నడ భాష, సంస్కృతి, వారసత్వ అధ్యయనానికి అంకితమైన ఏకై క విశ్వవిద్యాలయంగా ఖ్యాతి గడించిన, కన్నడ భూమి, భాష, నీటిని పరిరక్షించేందుకు 35 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో ప్రారంభమైన కన్నడ విశ్వవిద్యాలయం నాటి నుంచి ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోందని ఏకరువు పెట్టారు. వేతనాలు లేక అతిథి అధ్యాపకులు, బోధన సహాయకులు ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారన్నారు.


