మురిపాల కృష్ణా.. ముద్దుల గోవిందా | - | Sakshi
Sakshi News home page

మురిపాల కృష్ణా.. ముద్దుల గోవిందా

Sep 4 2026 1:48 AM | Updated on Sep 4 2026 1:48 AM

యశవంతపుర: రాష్ట్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందడి గురువారం నుంచి ఆరంభమైంది. దేవాలయాలు, పాఠశాలల్లో కృష్ణ, గోపికల వేషాల్లో బాల బాలికలు మురిపించారు. ఇక నల్లనయ్య కొలువైన ప్రఖ్యాత ఉడుపి శ్రీకృష్ణ ఆలయంలో 2 రోజుల పాటు నయనానందకరంగా వేడుకలు జరుగుతాయి. శుక్రవారం, శనివారం విట్లపిండి ఉత్సవంతో పాటు పలు సంబరాలు నిర్వహిస్తారు. గర్భగుడిలో శ్రీకృష్ణునికి విశేష పూజలు చేయనున్నారు. ఈసారి పులివేషాల ప్రదర్శన, మల్ల యుద్ధం పోటీలు జరుపుతారు. రాష్ట్రం నుంచే కాక కేరళ, గోవా తదితర ప్రాంతాల నుంచి భారీగా భక్తజనం వస్తున్నారు. బెంగళూరు రాజాజీనగర ఇస్కాన్‌ దేవస్థానంలో శ్రీకృష్ణ జన్మాష్ఠమి వేడుకలు మొదలయ్యాయి.

ఆరంభమైన జన్మాష్టమి సందడి

ఉడుపిలో నేటి నుంచి ఉత్సవాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement