దొడ్డబళ్లాపురం: స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్–2026లో మహిళల పారా షాట్‌పుట్ విభాగంలో కాంస్య పతకం సాధించిన కర్ణాటక యువతి కేఎస్ శిల్పను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సత్కరించారు. సీఎం ఆమెకు రూ.20 లక్షల చెక్ అందజేశారు. ఈసందర్భంగా గ్రూప్ బీ ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నట్లు కూడా ప్రకటించారు. మైసూరు జిల్లా కృష్ణరాజసాగర తాలూకా కంచుగార గ్రామానికి చెందిన శిల్ప నాలుగేళ్ల వయసులోనే ఎడమ కాలు పోగొట్టుకుంది. అయితే అంతటితో కుంగిపోకుండా శిల్ప చదువుతోపాటు షాట్‌పుట్ క్రీడలో రాణిస్తూ శిక్షణ తీసుకుని కామన్వెల్త్ గేమ్స్ వరకూ ప్రస్థానాన్ని కొనసాగించి పతకాన్ని సాధించింది.


