కొట్టూరేశ్వర స్వామి దర్శనానికి క్యూ | - | Sakshi
Sakshi News home page

కొట్టూరేశ్వర స్వామి దర్శనానికి క్యూ

Aug 13 2026 12:51 AM | Updated on Aug 13 2026 12:51 AM

హొసపేటె: నాగ అమావాస్య సందర్భంగా కొట్టూరులోని శ్రీగురు బసవేశ్వర స్వామి ఆలయానికి బుధవారం భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పట్టణంలోని శ్రీగురు బసవేశ్వర స్వామి ఆలయంలో నాగ అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. బ్రహ్మ ముహూర్తంలో శ్రీగురు బసవేశ్వర స్వామికి మహా రుద్రాభిషేకం, మహా మంగళ హారతి, వివిధ ధార్మిక కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు ఆలయానికి ఇరువైపులా వరుసలో నిలబడి, స్వామి వారికి పూలు, పండ్లు, కొబ్బరికాయలు సమర్పించారు.

ఊరమ్మదేవికి ప్రత్యేక పూజలు

శ్రావణమాసం ప్రారంభమై నాగ అమావాస్య నేపథ్యంలో బుధవారం కూడ్లిగి పట్టణంలోని శ్రీ ఊరమ్మ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి విగ్రహాన్ని అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement