బసవ జయంతిని జాతీయ పండుగలా ఆచరించాలి | - | Sakshi
Sakshi News home page

బసవ జయంతిని జాతీయ పండుగలా ఆచరించాలి

Aug 13 2026 12:51 AM | Updated on Aug 13 2026 12:51 AM

రాయచూరు రూరల్‌: కర్ణాటకలో బసవ జయంతిని ఆచరిస్తున్నట్లుగానే దేశంలో కూడా జాతీయ పండుగలా ఆచరించాలని బీదర్‌ జిల్లా శాసన సభ్యులు డాక్టర్‌ శైలేంద్ర బేల్దాళ్‌, ప్రభు చౌహాన్‌, శరణ సలగార్‌ డిమాండ్‌ చేశారు. న్యూఢిల్లీలో ఉన్నత విద్యా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కార్యాలయంలో మంత్రి ప్రహ్లాద్‌ జోషిని కలిసి పుష్పగుచ్ఛం అందించి శాలువా కప్పి సన్మానించి ఆయన మాట్లాడారు. కర్ణాటకతో పాటు వివిధ రాష్ట్రాల్లో బసవ జయంతిని ఆచరిస్తున్నందున దేశ వ్యాప్తంగా జాతీయ పండుగలా ఆచరించేలా చూడాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. బీజేపీ నేతలు సోమనాథ్‌ పాటిల్‌, సిద్దూ పాటిల్‌, రఘునాథ్‌, పీరప్ప, ప్రకాష్‌ ఖండ్రే, కిరణ్‌, బాబు, ఈశ్వర్‌ సింగ్‌, బసవరాజ్‌లున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement