కోలారు: కోలారు వద్ద అప్పుల బాధను తట్టుకోలేక మహిళ ఇద్దరు పిల్లలతో కలిసి పొలంలోని నీటి కుంటలోకి దూకి ఆత్మహత్య చేసుకొంది. కోలారు తాలూకాలోని చత్రకోడిహళ్లి సమీపంలో ఈ విషాదం వెలుగుచూసింది. వివరాలు.. బెగ్లి బెనాజనహళ్లి గ్రామానికి చెందిన తల్లి ప్రమీళ (40), కుమార్తె స్వప్న (22), కొడుకు చరణ్ (18) మృతులు. ఇల్లు కట్టుకోవడం కోసం ప్రమీళ రూ.15 లక్షలు ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల నుంచి అప్పులు తీసుకుంది. చెల్లించాలంటూ ఫైనాన్స్‌ల నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఈ విషయమై శుక్రవారం రాత్రి భర్త సురేష్‌తో వాగ్వివాదం జరిగింది. తర్వాత ఆమె, పిల్లలు రాత్రి 11 గంటలకు ఇంటి నుంచి వెళ్లిపోయి ఓ రైతు పొలంలోని ఫారంపాండులో దూకి తనువు చాలించారు. శనివారం ఉదయం మృతదేహాలు బయటపడ్డాయి. దీంతో భర్త కూడా పురుగుల మందు తాగడంతో ఆస్పత్రికి తరలించారు. కోలారు గ్రామాంతర పోలీసులు విచారణ చేపట్టారు.
నీటి కుంటలోకి దూకి ఆత్మహత్య
కోలారు వద్ద విషాదం


