మైసూరు: రాచనగరి మైసూరులో అమానుష ఘటన వెలుగు చూసింది. ముగ్గురు బాలికలపై ఓ కామాంధుడు లైంగిక దాడులకు పాల్పడ్డాడు. నిందితుడు మొదట 9వ తరగతి చదువుతున్న బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అసభ్యకరమైన వీడియో క్లిప్‌తో ఆమెను బెదిరించి, తన స్నేహితురాళ్లను తీసుకురమ్మని ఒత్తిడి చేశాడు. అనంతరం ఆమె తీసుకువచ్చిన మరో ఇద్దరు బాలికలపై కూడా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈ ఘోరం వెలుగు చూడగా పోలీసులు సదరు కామాంధుడిని కటకటాల వెనక్కు నెట్టి విచారణ చేస్తున్నారు. ఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.. ఓ బాలిక మైసూరులోని విజయనగరలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఆమెకు తన పొరుగు గ్రామానికి చెందిన 34 ఏళ్ల వ్యక్తిని ఇన్‌స్టా ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అతను ఆమెతో నిరంతరం సంప్రదిసూ మాయమాటలతో తన ఇంటికి రప్పించుకున్నాడు. అతడిని నమ్మిన బాలిక విజయనగరలోని అతని ఇంటికి వచ్చింది. ఆ సమయాన్ని ఉపయోగించుకుని, అతను ఆమైపె లైంగిక దాడికి పాల్పడ్డాడు. తన మొబైల్ ఫోన్‌లో ఆమె అశ్లీల వీడియోను చిత్రీకరించాడు. అలా అతను ఆమెను పదేపదే లైంగికంగా వేధించాడు. ఆ తర్వాత ఆ వీడియో క్లిప్‌లను చూపుతూ ఆమెను బెదిరించాడు.
ముగ్గురు బాలికలపై లైంగిక దాడులు
తొలుత ఒక బాలికపై అఘాయిత్యం
వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేసి
ఆమె స్నేహితురాళ్లపై కూడా దాష్టీకం
స్నేహితురాళ్లను తీసుకురమ్మని ఒత్తిడి
తన స్నేహితురాళ్లను తనతో పాటు ఇంటికి తీసుకురమ్మని ఆమైపె ఒత్తిడి తెచ్చాడు. లేకపోతే ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు. దీంతో మనస్తాపం చెందిన ఆ బాలిక, తన ఇద్దరు స్నేహితురాళ్లను అతని ఇంటికి తీసుకువెళ్లింది. అతను వారిపై కూడా లైంగిక దాడికి పాల్పడటమేగాక మిగతా స్నేహితురాళ్లను కూడా తీసుకురమ్మని ఆమైపె ఒత్తిడి తెచ్చాడు. ఆందోళనకు గురైన ఆ బాలిక ఈ విషయాన్ని తన తల్లిదండ్రుల దృష్టికి తెచ్చింది. దీంతో వారు ఒడనాడి సేవా సంస్థకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన స్పయాని, పరశు ఈ విషయాన్ని బాలల సంరక్షణ కమిటీ సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత బాలిక, ఆమె తల్లిదండ్రులు విజయనగర డివిజన్ ఏసీపీకి కూడా ఈ సంఘటనల గురించి ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. బాలల సంరక్షణ కమిటీ కూడా బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేసింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.


