సాక్షి, బళ్లారి: మాజీ లోక్‌సభ సభ్యుడు, మాజీ విధాన పరిషత్ సభ్యుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కే.సీ కొండయ్య జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. నగరంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ..బళ్లారి జిల్లా అభివృద్ధికి కేసీ కొండయ్య చేసిన సేవలు మరవలేనివన్నారు. కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘంగా సేవలందించారని గుర్తు చేశారు. ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో నగర మేయర్ గాదెప్ప, బుడా అధ్యక్షుడు జే.ఎస్ ఆంజనేయులు, ప్రముఖ పారిశ్రామికవేత్త ఈ శ్రీనివాస్ (కడియం సీన), సంగనకల్ మానయ్య, కాంగ్రెస్ ప్రముఖులు చంద్ర, ఎన్.వీరారెడ్డి, మహేష్, నగర కార్పొరేటర్లు, మాజీ జెడ్పీ మెంబర్లు, జిల్లా ఆస్పత్రి వైద్యాధికారి బసారెడ్డి, పలువురు వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.


