అక్రమ వలసలతో దేశ భద్రతకు ముప్పు | - | Sakshi
Sakshi News home page

అక్రమ వలసలతో దేశ భద్రతకు ముప్పు

Jul 11 2026 12:42 AM | Updated on Jul 11 2026 12:42 AM

శివాజీనగర: కర్ణాటక ప్రభుత్వం అమలు చేసిన శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం (పీఆర్‌సీ) నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని, జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తున్నాయని ఆరోపిస్తూ కేంద్ర మంత్రి శోభా కరంద్లాజె కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు శుక్రవారం లేఖ రాశారు. ఈ నిబంధనల అమలులో తక్షణమే జోక్యం చేసుకుని, వాటిని నిలిపివేయాలని ఆమె డిమాండ్‌ చేశారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌–14 ఉల్లంఘన

‘భారత రాజ్యాంగం దేశంలోని పౌరులందరికీ ఏక పౌరసత్వాన్ని అందిస్తుంది. కానీ కర్ణాటక ప్రభుత్వం ఎలాంటి రాజ్యాంగ లేదా చట్టబద్ధమైన అధికారం లేకుండానే శాశ్వత నివాసితులు అనే ప్రత్యేక వర్గాన్ని సృష్టించబోతోంది. ఇది చట్టవిరుద్ధం. సమానత్వ హక్కును సమర్థించే రాజ్యాంగంలోని ఆర్టికల్‌–10ని ఇది నేరుగా ఉల్లంఘించడమే అని అమిత్‌షాకు రాసిన లేఖలో శోభా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వలసదారులు సులభంగా నకిలీ పత్రాలను సృష్టించి, ఈ శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం పొందే అవకాశముంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు.

పోలీసుల అదుపులో బంగ్లా అక్రమ వలసదారులు

దొడ్డబళ్లాపురం: బంగ్లాదేశ్‌ నుంచి కూలీలుగా రాష్ట్రంలోకి అక్రమంగా ప్రవేశించిన ఆరుమందిని మంగళూరు సురత్కల్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా నిర్మిస్తున్న ఒక ప్రైవేటు ఆస్పత్రి కట్టడ నిర్మాణంలో వీరు కూలీలుగా పని చేయడానికి వచ్చినట్టు సమాచారం. వీరిని తిరిగి బంగ్లాదేశ్‌ పంపించడానికి ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓకి లేఖ రాశారు. మరోవైపు మండ్య రైల్వే స్టేషన్‌లో 50మందికి పైగా బంగ్లాదేశీయులు దిగినట్టు సమాచారం అందడంతో బీజేపీ కార్యకర్తలు, నేతలు రైల్వేస్టేషన్‌కు వెళ్లి వారి వివరాలు తెలుసుకున్నారు. ఆ సమయంలో వారివద్ద బంగ్లాదేశ్‌ ఆధార్‌ కార్డులు లభించాయి. వివరాలు అడుగుతుండటంతో వలసదారులు అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం.

కర్ణాటకలో శాశ్వత నివాస

ధ్రువీకరణ పత్రం అమలును అడ్డుకోండి

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు

కేంద్ర మంత్రి శోభా కరంద్లాజె లేఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement