రాయచూరు రూరల్: గుండెపోటుతో న్యాయవాది మృతి చెందిన ఘటన కొప్పళ జిల్లాలో చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం కొప్పళ జిల్లా కుష్టగి సివిల్ సీనియర్ కోర్టులో కేసు వాదిస్తున్న సమయంలో న్యాయవాది నింగప్ప (48) గుండెపోటుకు గురై మృతి చెందారు. తావరగెరకు చెందిన నింగప్ప.. కోర్టు కార్యకలాపాల్లో నిమగ్నులు కావడంతో అకస్మాత్తుగా గుండెపోటు వచ్చినట్లు సమాచారం.
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి
కోలారు: జిల్లాలోని బంగారుపేటలో ఉన్న ఎస్‌డీసీ విద్యార్థులు శనివారం మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జనజాగృతి జాతా నిర్వహించారు. ఈ సందర్భంగా కెజీఎఫ్ ఎస్పీ శివాంశు రాజపూత్ మాట్లాడుతూ.. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాలను సేవించాలని బలవంతం చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అలాంటి వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మాదక ద్రవ్యాలు విద్యార్థుల అమూల్య జీవితాన్ని నాశనం చేస్తాయని తెలిపారు. జాతాలో 600 మందికి పైగా విద్యార్థులు పట్టణంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీ చేపట్టారు.


