హుబ్లీ: హుబ్లీ–ధార్వాడ తర్వాత కొప్పళలో మరో లవ్ జిహాద్ కేసు వెలుగులోకి వచ్చింది. కొప్పళ తాలూకా కంప్లి గ్రామానికి చెందిన ముస్తఫా.. నర్సింగ్ చదువుతున్న విద్యార్థినితో ప్రేమాయణం సాగించాడు. యువతిని మభ్యపెట్టి పార్కులకు తీసుకెళ్లాడు. అంతేగాక లవ్ జిహాద్‌కు ప్రేరణ ఇచ్చారని బాధిత యువతి బంధువులు ఆరోపించారు. ఇటీవల వీరిద్దరు జిల్లా ఆస్పత్రి వద్ద ఉండగా హిందూ జాగరణ వేదిక కార్యకర్తలకు చిక్కారు. ఈ క్రమంలో ముస్తఫా మొబైల్ పరిశీలించగా.. హిందూ యువతుల ఫొటోలు, నగ్న వీడియోలు దర్శనమిచ్చాయి. హిందూ యువతులకు బీర్ తాపించి, మాంసం తినిపించినట్లు సమాచారం. అంతేగాక గంజాయి, ఉక్కాతో ఉన్న వీడియోలు కూడా ఉన్నట్లు తేలింది. ముస్తఫా మట్కా బుక్కి అని చెబుతున్నారు. హిందూ జాగరణ వేదిక, విశ్వ హిందూ పరిషత్ ప్రముఖులు కార్యకర్తలు జిల్లా ఎస్పీ డాక్టర్ అరసిద్దిని కలిశారు. హిందూ యువతులను లవ్ జిహాద్‌కు ముస్తఫా ప్రేరేపిస్తున్నాడని ఫిర్యాదు చేశారు. తక్షణమే కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు.


