● రూ.7.50 కోట్ల దోపిడీ
● బ్యాంక్ ఉద్యోగిపై కేసు నమోదు
సాక్షి, బళ్లారి: నగరంలోని మాన్వి పట్టణ సహకార బ్యాంకులో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. బ్యాంకులో పని చేసే ఉద్యోగి రూ.కోట్లాది రూపాయలను తమ బంధువులు, ఇతర వ్యక్తుల ఖాతాల్లోకి బదిలీ చేసుకుని అవినీతికి పాల్పడ్డారు. ఉద్యోగి రమేష్ 2023 సంవత్సరం నుంచి దశల వారీగా గుట్టుచప్పుడు కాకుండా తల్లిదండ్రులు, భార్య పేరుతో బ్యాంకు ఖాతాలు తెరిచాడు. వారి ఖాతాల్లోకి ఏకంగా రూ.7.50 కోట్లు నగదును బదిలీ చేశాడు. ఆరుగురి ఖాతాల్లోను నగదును ఎవరికి అనుమానం కలగకుండా నకిలీ సంతకాలు చేసి కోట్లాది రూపాయల నగదును బదిలీ చేసుకున్నాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఏపీఎంసీ పోలీసులకు ఫిర్యాదు అందింది. బ్యాంకులో పనిచేసి కోట్లాది రూపాయలను తమ బంధువులు ఖాతాల్లోకి జమ చేసుకున్న రమేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
బీజేపీ కార్యకర్తల పార్టీ
రాయచూరు రూరల్: బీజేపీ కుటుంబ పార్టీ కాదని.. కార్యకర్తల పార్టీ అని శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ పేర్కొన్నారు. శనివారం బీజేపీ కార్యాలయంలో ప్రశిక్షణ శిబిరాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి సేవలు చేయలేని, కుటుంబ రాజకీయాలు చేసేవి రాజకీయ పార్టీలు కాదన్నారు. బీజేపీకి అజాత శత్రువుగా పేరు పొందిన అటల్ బిహరీ వాజ్‌పేయి, ఎల్‌కే అద్వానీ, మురళి మనోహర్ జోషి, సుష్మా స్వరాజ్ తదితరులు పార్టీకి చేసిన సేవలు మరువరానివని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వీరన గౌడ, శంకరప్ప, అమర్‌నాథ్ పాటిల్, సుశీల్ నమోషి, రాజ్ కుమార్, రాఘవేంద్ర, రమానంద యాదవ్, రవీంద్ర, శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దాహం తీరుస్తున్న చలివేంద్రాలు
రాయచూరు రూరల్: వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే ప్రజల సౌకర్యార్థం అమృత నెరళు పేరుతో రాయచూరు నగర సభ అధికారులు ఏర్పాటు చేసిన చలివేంద్రాలు దాహార్తి తీరుస్తున్నాయి. ప్రజలు సేద తీరేందుకు వెదురుతో గుడిసెలు నిర్మించి, అందులో నీటి కుండలను పెట్టి నీటి వసతి కల్పించారు. నగరంలోని ఆర్టీఓ సర్కిల్, కేఈబీ పాఠశాల, జహిరాబాద్ సర్కిల్, తీన కందిల్, బస్టాండ్, గంజ్ సర్కిల్‌లో చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రజలు అమృత నెరళును సద్వినియోగం చేసుకోవాలని నగర సభ కమిషనర్ జుబీన్ మోహపాత్రో సూచించారు.
ఆత్మ విశ్వాసంతో
విధులు నిర్వర్తించాలి
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆత్మ విశ్వాసంతో విధులు నిర్వర్తించాలని ఎస్పీ అరుణాంగ్శు గిరి సూచించారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో ముఖ్యమంత్రి పతకం అందుకున్న డీఎస్పీ శాంత వీరకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. బాధ్యతగా విధులు నిర్వహించినప్పుడే జీవితంలో ౖఏదెనా సాధించేందుకు అవకాశాలు ఉంటాయని వివరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ కుమార స్వామి, హరీష్, డీఎస్పీ వెంకటేష్, ఏసీ హంపణ్ణ, జిల్లా జైలర్ అనిత, సీపీఐలు నాగారాజ్, ఉమేష్ కాంబ్లే, ఎస్‌ఐలు మంజునాథ్, బసవరాజ్, పరమానంద, డి.ప్రకాష్, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పీయూసీలో మార్కులు
తక్కువ వచ్చాయని ఆత్యహత్య
హుబ్లీ: పీయూసీలో తక్కువ మార్కులు వచ్చాయనే బాధతో విద్యార్థిని ఆత్యహత్య చేసుకున్న ఘటన స్థానిక ఉనకల్ సిద్ద కళ్యాణ నగర్‌లో చోటు చేసుకుంది. విద్యా నగర్ కనకదాస కళాశాల విద్యార్థిని శ్రావణి (18). ఇటీవల విడుదలైన ద్వితీయ పీయూసీ ఫలితాల్లో కామర్స్ విభాగంలో 77 శాతం మార్కులు సాధించింది. శ్రావణి తండ్రి మారుతి ఆటో గ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇంట్లో చదవడానికి అవకాశం లేకపోవడంతో ఉనకల్‌లోని అవ్వతాత ఇంట్లో పెట్టారు. చురుకై న విద్యార్థిని శ్రావణి పరీక్షల్లో 95 శాతం మార్కులు తెస్తానని చాలా ఆశ పెట్టుకుంది. ఎక్కువ మార్కులు సాధించలేక పోయానన్న మనోవేదనకు గురైన శ్రావణి.. ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆశించిన మేర మార్కులు సాధించక పోవడంతో ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు. మార్కులే జీవితం కాదని తొందర పాటుతో విద్యార్థులు ఇలాంటి నిర్ణయాలు తీసుకోరాదని మానసిక వైద్యులు పేర్కొన్నారు.


