సాంకేతికతను ఉపయోగించుకోండి | - | Sakshi
Sakshi News home page

సాంకేతికతను ఉపయోగించుకోండి

Apr 12 2026 6:17 AM | Updated on Apr 12 2026 6:17 AM

హొసపేటె: మీ మేథస్సుకు తోడ్పడే సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ డీవీ.పరమ శివమూర్తి అన్నారు. హంపీ కన్నడ విశ్వవిద్యాలయంలోని భువన విజయ ఆడిటోరియంలో యూజీసీ పీహెచ్‌డీ 4వ దశ ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగ ఆయన మాట్లాడుతూ.. టెక్నాలజీతో సమయం ఆదా అవుతుందని తెలిపారు. పాత, కొత్తలను సమన్వయం చేసుకుంటూ పరిశోధనను ఒక కొత్త కోణంలో రూపొందించాలన్నారు. నేటి కంప్యూటర్‌ టెక్నాలజీ మానవుల ఉనికినే ప్రశ్నిస్తోందని కొందరు భయపడుతున్నారని తెలిపారు. కానీ అలాంటి భయం అవసరం లేదని భరోసా ఇచ్చారు. మనుషుల ఏ సమస్యకై నా పరిష్కారాలు కనుక్కొంటారన్నారు. వేలాది పుస్తకాలు మన చేతివేళ్ల కొనల్లోనే అందుబాటులో ఉన్న ఈ యుగంలో వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సాంస్కృతిక మేధావి డాక్టర్‌ జి.వి.ఆనందమూర్తి, మైసూరుకు చెందిన సీనియర్‌ సైన్స్‌ రచయిత కొల్లేగల్‌ శర్మ విద్యా వ్యవహారాలు డైరెక్టర్‌ డాక్టర్‌ అమరేష్‌ యటగల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement