భక్తిశ్రద్ధలతో గంధం ఊరేగింపు
రాయచూరు రూరల్: యరగేర బడేసాబ్ దర్గా ఉరుసులో భాగంగా సోమవారం రాత్రి భక్తిశ్రద్ధలతో గంధం ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గాను ప్రత్యేకంగా అలంకరించారు. నిర్వాహకులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో హరిశ్చంద్ర రెడ్డి, జనార్దన రెడ్డి, వెంకటరామిరెడ్డి, విద్యానంద రెడ్డి, రాకేష్ రెడ్డి, మోహబూబ్ పటేల్, ఫారూక్, జాముద్దీన్, హఫీజూల్లా, క్రిష్ణాజి, నాగరాజు నాయక్, మహదేవ్, వెంకటేష్, రాము, హరి, మలంగ్ పాల్గొన్నారు.
ఘనంగా సువర్ణ వాహిని వార్షికోత్సవం
బళ్లారి టౌన్: స్థానిక పత్రికా భవనంలో మంగళవారం సువర్ణ వాహిని స్థానిక దినపత్రిక నాలుగో వార్షికోత్సవం సంపాదకుడు రవి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. జిల్లా న్యాయమూర్తి రాజేష్ హొసమని మాట్లాడుతూ.. వార్తలను నిష్పక్షపాతంగా రాసి ప్రజల విశ్వాసాన్ని పొందాలని విలేకరులకు సూచించారు. కార్యక్రమంలో బీహెచ్‌ఓ యల్లా రమేష్ బాబు, జిల్లా సర్జన్ బసిరెడ్డి, సమాచార శాఖ గురురాజ్, నిష్టి రుద్రప్ప, బసప్ప పాల్గొన్నారు.
ఏళ్ల సమస్యకు పరిష్కారం
బళ్లారి అర్బన్: వీణివీరాపుర గ్రామం మహాయోగి వేమన పీఠం వద్ద ప్రజల కోరిక మేరకు ఏర్పాటు చేసిన బస్టాప్ బోర్డును మంగళవారం బళ్లారి ఆర్టీసీ డివిజన్ ట్రాఫిక్ అధికారి బి.చామరాజ ప్రారంభించారు. వేమన పీఠం గౌరవ అధ్యక్షుడు గణపాల్ ఐనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యను పరిష్కరించినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. ఇందుకు సహకరించిన సంబంధిత ఆర్టీసీ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. బస్సులు ఇక్కడ ఆపడం వల్ల విద్యార్థులు, యోగి వేమ పీఠాన్ని సందర్శించే రెడ్డి తదితరులకు చాలా అనుకూలమన్నారు. గణపాల్ గోవింద రెడ్డి జ్ఞాపకార్థం బస్ సెంటర్ నిర్మిస్తామన్నారు. కర్ణాటక రెడ్డి జన సంఘం బెంగళూరు వారు రూపొందించిన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో శివప్రసాద్, సంజీవ్ రెడ్డి, శేషరెడ్డి, హనుమంత రెడ్డి, బసవరాజ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సౌకర్యాల కల్పనలో
నిర్లక్ష్యం వద్దు
కోలారు: పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక సౌకర్యాలను అందించాలని జిల్లాధికారి ఎం.ఆర్ రవి అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయ భవనంలో ప్రధాని 15 అంశాల కార్యక్రమాలపై ప్రగతి పరిశీలన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం మైనారిటీల కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు.


