తల్లీబిడ్డల మరణాలు నియంత్రించాలి
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లాలో తల్లీబిడ్డల మరణాల రేటు నియంత్రించాలని జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఈశ్వర్ కుమార్ వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా పంచాయతీ కార్యాలయంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. నవోదయ దంత వైద్యకీయ, ఏఏంఈఎస్ దంత కళాశాలతో ఒప్పందాలు కుదర్చుకోవడం జరిగిందన్నారు. తల్లీబిడ్డల మరణాల రేటు నేడు 15 శాతం అయిందని పేర్కొన్నారు. ఏడుగురు వైద్యులను ఇతర చోటికి బదిలీ చేయాలని ఆదేశాలు వచ్చినా.. పనుల నిమిత్తం వారిని విధుల్లో కొనసాగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఆరోగ్య అధికారి సురేంద్ర బాబు, ఆర్‌సీహెచ్ అధికారిణి నందిత, విజయ్ శంకర్, ప్రవీణ్ కుమార్, ఆరతి, శివ మానప్ప, అనిల్, గణేష్, శివకుమార్, శాకీర్, ఈశ్వర్, బసయ్య పాల్గొన్నారు.


